Begin typing your search above and press return to search.

ఆ వాలు చూపుల్లో ఎవ‌రైనా క‌రిగిపోవాల్సిందే!

By:  Tupaki Desk   |   26 Feb 2022 4:30 AM GMT
ఆ వాలు చూపుల్లో ఎవ‌రైనా క‌రిగిపోవాల్సిందే!
X
సోష‌ల్ మీడియాలో రాయ్ ల‌క్ష్మీ యాక్టివిటీస్ ఎంత యాక్టివ్ గా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఫోటో సెష‌న్స్ ఉన్న‌దే ఇన్ స్టాని హీటెక్కించ‌డానికి అన్న రేంజ్ లో దుమ్ముదులేపిస్తోంది. ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డం కోసం బ్యూటీ పెద్ద ఎత్తుఏ సాహ‌సాలు చేస్తుంటుంది. ఆన్ స్ర్కీన పైనే హ‌ద్దులు మీరి హీటెక్కించిన బ్యూటీ ఆఫ్ ది స్ర్కీన్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు మంట‌లు పుట్టిస్తూనే ఉంటుంది. గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ లో త‌న‌దైన మార్క్ వేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. తాజాగా బ్యూటీ మ‌రోసారి ఓ టెంప్టింగ్ ఫోటోతో కుర్ర‌కారుని ఆక‌ట్టుకుంటుంది. స‌న్న‌జాజి సోయ‌గం టోన్డ్ బాడీ లుక్ లో మ‌త్తెక్కిస్తోంది.

టాప్ లో మిక్స్ డ్ క‌ల‌ర్ షోల్డ‌ర్ లెస్ స్కిన్ టైట్ బ్లౌజ్.. బాట‌మ్ లో మ్యాచింగ్ డిజైన‌ర్ దుస్తుల్లో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. పెదాల‌కు ఎర్ర‌టి లిప్ స్టి్క్ పూసింది. మ‌త్తెక్కించే పిల్లి క‌ళ్ల లుక్ లో ఎవ‌రైనా మునిగిపోవాల్సిందే. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతూ అభిమానం చాటుకుంటున్నారు.

ఇక బ్యూటీ కెరీర్ విష‌యానికి వ‌స్తే అమ్మ‌డి అందం..అభినాయానికి టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుంద‌ని భావించారు. కానీ రామ్ ల‌క్ష్మి కెరీర్ మ‌రో ట‌ర్నింగ్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు నాట ఫేమ‌స్ అయినా న‌టిగా అవ‌కాశాలు అనుకున్నంత‌గా రాలేదు. దీంతో ఇత‌ర భాష‌ల్లో బిజీ అయింది. త‌మిళం..మ‌ల‌యాళం..క‌న్న‌డ భాష‌ల్లోనే ఎక్కువ సినిమాలు చేసింది. న‌టిగా అక్క‌డ బిజీ అయిన త‌రుణంలో శ‌రీరంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ముఖానికి..ముక్కుకి కొన్ని ర‌కాల శ‌స్ర్త చికిత్స‌లు చేయించుకున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. దీంతో రూప లావ‌ణ్యంలో కొన్ని మార్పులొచ్చాయి.

అంత‌కు ముందు అవ‌కాశాలు స‌రిగ్గా రావ‌డం లేద‌ని ఏకంగా జ్యోతిష్యాల్ని విశ్వ‌సించింది. ఈ క్ర‌మంలోనే గా ఉన్న ల‌క్ష్మీరాయ్ గా ఉన్న పేరుని రాయ్ ల‌క్ష్మిగా మార్పు చేసింది. ఆ ప్యాక్ట‌ర్ చాలా వ‌ర‌కూ క‌లిసొచ్చింది. పేరు మార్పు త‌ర్వాత‌నే అవ‌కాశాలు ఊపందుకున్నాయి. ప్ర‌స్తుతం తెలుగులో రాయ్ ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో `ఆనంద భైరవి` అనే సినిమా తెర‌కెక్కుతోంది.

ఈ చిత్రం ప్రారంభ‌మై చాలాకాలం అవుతోంది. ఇంకా ఆన్ సెట్స్ లోనే ఉంది. ఇక మ‌ల‌యాళం..త‌మిళం..క‌న్న‌డ భాష‌ల్లో ఒక్కో సినిమా చేస్తోంది.