Begin typing your search above and press return to search.

బాత్ ట‌బ్ లో ర‌త్తాలు

By:  Tupaki Desk   |   6 Jan 2019 10:47 AM GMT
బాత్ ట‌బ్ లో ర‌త్తాలు
X
ర‌త్తాలు స‌రిగ‌మ‌ల గురించి యూత్ కంటిన్యూగా మాట్లాడుకుంటూనే ఉంటారు. రాయ్ ల‌క్ష్మీ చిద్విలాసాలు ఒక‌టా రెండా.. నిరంత‌రం అన్ లిమిటెడ్ ఎపిసోడ్స్ తో ఏదో ఒక చ‌డీ చ‌ప్పుడు చేస్తూనే ఉంటుంది. అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ నిరంత‌రం వేడెక్కే టాపిక్ ఏదో ఒకటి ర‌త్తాలు గురించి త‌ప్ప‌నిస‌రి.

లేటెస్టుగా ఇదిగో ఇలా బాత్ ట‌బ్‌ లో కొత్త‌గా ఇంగ్లీష్ టీచ‌ర్ అవ‌తారం ఎత్తింది. ఇద్ద‌రు టాప్ మోడ‌ల్స్ తో క‌లిసి ర‌త్తాలు దిగిన ఈ ఫోటో యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది. ఆ లెఫ్ట్ క‌టింగ్ లో పాపీ జ‌బ్బ‌ల్ అనే మోడ‌ల్... రైట్‌ లో సోనాలి సైగ‌ల్ అనే సూప‌ర్ మోడ‌ల్ .. కుడి ఎడ‌మైతే పొరపాటు లేదోయ్ అంటూ మ‌ధ్య‌లో ర‌త్తాలు స‌రిగంగ స్నానాలాడుతోంది.

ముగ్గురు ముద్దుగుమ్మ‌ల వ‌య్యారాల భారం మోయ‌లేక బాత్ ట‌బ్ వాట‌ర్ స‌ల‌స‌లా కాగుతోంది. ఖైదీనంబ‌ర్ 150 చిత్రంలో ర‌త్తాలు ర‌త్తాలు అంటూ చిరంజీవి మాష్టారే వెంట‌ప‌డ్డారు. ఇక కుర్ర‌కారు ఏపాటీ? ర‌త్తాలుని ఇలా చూశాక ఆగ‌కుండా ఉంటారా.. ఆగ‌లేనంటారా? ఏమో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఇంత‌కీ రాయ్ ల‌క్ష్మీ ప‌రిచ‌యం చేసిన‌ ఆ కొత్త ఇంగ్లీష్ టీచ‌ర్ ఎవ‌రో కానీ, ర‌త్తాల్ని మించి గుచ్చి గుచ్చి చూసేస్తోంది. ఆవిడేవైనా సౌత్ సినిమా వైపు సూపు సూత్తోందా?