Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో హాటీ లక్ష్మి ఫస్ట్ లుక్..

By:  Tupaki Desk   |   16 Oct 2016 7:44 AM GMT
మెగాస్టార్ తో హాటీ లక్ష్మి ఫస్ట్ లుక్..
X
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ మూవీ సూపర్ స్పీడ్ లో షూటింగ్ ఫినిష్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి అయిపోయినట్లు టాక్. ఇప్పటికే హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో సీన్స్.. సాంగ్స్ తో పాటు ఐటెమ్ సాంగ్ పిక్చరైజేషన్ కూడా మొదలైపోయింది.

ఖైదీ నెంబర్ 150లో మొదట ఐటెమ్ గాళ్ గా కేథరిన్ థ్రెసాను అనుకున్నా ఇప్పుడా ప్లేస్ ను లక్ష్మీరాయ్ దక్కించుకుంది. ఇప్పటికే హాటీ లక్ష్మి మెగాస్టార్ తో షూటింగ్ ని కూడా మొదలుపెట్టేయగా.. ఇప్పుడు చిరుతో షూటింగ్ స్పాట్ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. చిరు సినిమాల్లో ఐటెం సాంగ్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయనే మెగా ఫ్యాన్స్ కు బాగా తెలుసు. వారి ఊహలకు అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చిరు మిలమిలా మెరిసిపోతుంటే.. అందాల భాల లక్ష్మీరాయ్ మిసమిసలాడిపోతోంది. మొదటిసారిగా చిరంజీవితో కలిసి నటిస్తున్న ఆనందం అమ్మడి కళ్లల్లో కదలాడుతోంది.

సౌతిండియాలో గ్రేట్ డ్యాన్సర్ అని ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పిలిపించుకున్న ప్రభుదేవాతో ప్రశంసించిన చిరంజీవి.. మరో గ్రేట్ డ్యాన్సర్ కం డైరెక్టర్ కి సన్నిహితురాలైన లక్ష్మీ రాయ్ లు కలిసి చిందులు వేస్తుంటే.. అదీ ఐటెం సాంగ్ కి డ్యాన్సులు చేస్తుంటే.. ఆ సాంగ్ చూసేందుకు మెగా ఫ్యాన్స్ కి రెండు కళ్లు చాలవేమో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/