Begin typing your search above and press return to search.

లక్ష్మీ రాయ్‌.. సెల్ఫీలు.. విజిటర్లు

By:  Tupaki Desk   |   23 Nov 2015 5:30 PM GMT
లక్ష్మీ రాయ్‌.. సెల్ఫీలు.. విజిటర్లు
X
ఈ లక్ష్మీ రాయ్‌ పనే బాగుందండీ.. ఎప్పుడైతే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో అమ్మడు ఛాన్సు కొట్టేసిందో.. అప్పటి నుండి నిజంగానే సుడి తిరిగిపోయింది. అసలు అమ్మడికి ఏం చేసినా హైప్‌ వచ్చేస్తోంది అంతే. ఇప్పటివరకు కేవలం లారెన్స్‌ గాళ్‌ ఫ్రెండ్‌ అంటూ సంభోదించిన చాలామంది ఇప్పుడు మాత్రం పవన్‌ ఐటం గాళ్‌ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఈ హ్యాపెనింగ్‌ ను బాగా వాడేసుకుంటున్న లక్ష్మీ రాయ్‌.. రోజుకో సెల్ఫీ తన సోషల్‌ ఎకౌంట్‌ లో పెడుతూ తెగ అలరిస్తోంది. ఇదిగో ఈరోజు ఉదయాన్నే.. ఎక్కడో ట్రయిల్‌ రూమ్‌ లో కొత్త డ్రెస్‌ చెక్‌ చేసుకుంటూ తీసుకుంటున్న సెల్ఫీ అనుకుంట.. అది పోస్టు చేసి.. మండే మార్నింగ్‌ సెల్ఫీ అంటూ కలరింగ్‌ కచ్చింది. కట్‌ చేస్తే.. అమ్మడుకి మొన్న కాలు గాయమై ఆపరేషన్‌ చేయించుకుంది కాబట్టి.. ఆమెను చూడ్డానికి మాస్‌ రాజా రవితేజ - డ్యాన్స్‌ మాష్టర్‌ ప్రభుదేవా.. దర్శకుడు మెహర్‌ రమేష్‌.. ఆమెను త్వరగా కోల్కోవాలని విషెస్‌ చెబుతూ ఆమె ఇంటికి విచ్చేశారు. అదిగో.. వెంటనే అది కూడా వెంటనే ట్విట్టర్‌ లో దర్శనమిచ్చేసింది. ఆ విధంగా.. క్షణాలు ఏవైనా కావు ప్రచారానికి అనర్హాలు అన్నట్లు అమ్మడు టముకు వేసుకుంటోంది.

ఇకపోతే పవన్‌ కళ్యాణ్‌ సినిమాపై దాదాపు వర్కు పూర్తిచేసినట్లేనట. తదుపరి హైదరాబాద్‌ షెడ్యూల్‌ లో ఏమన్నా మళ్ళీ తలుక్కుమంటుందేమో చూడాలి.