Begin typing your search above and press return to search.

మామూలు ఆఫర్లు రావట్లేదంటున్న రత్తాలు

By:  Tupaki Desk   |   13 Jan 2017 3:55 PM GMT
మామూలు ఆఫర్లు రావట్లేదంటున్న రత్తాలు
X
''మామూలు ఆఫర్లు కాదనుకోండి.. ఓ రేంజులో వచ్చేశాయి'' అని అంటే మాత్రం.. మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. కాని ''ఖైదీ నెం 150'' ఐటెం గాళ్‌ రత్తాలు ఎలియాస్ హాట్ బ్యూటి లక్ష్మీ రాయ్ మాత్రం నాకు 'మామూలు' ఆఫర్లు రాలేదని అంటోంది. ఏంటో మరి అమ్మడు బాధ.. లెటజ్ సీ.

నిజానికి క్యాథరీన్ త్రెసా స్థానంలో లక్ష్మీ రాయ్ ను తీసుకోవడం అన్ని విధాలుగానూ ఖైదీ నెం 150కి ప్లస్సే అయ్యింది. అమ్మడు తన అందాలను ఓ రేంజులో ఆరేయడంతో పాటు.. హావభావాలతో ఆకట్టుకుంది. అమ్మడు ఆరబోసిన అందాలను మాస్ లో బాగానే వీలలు పడుతున్నాయి. అయితే ఈ అమ్మడుకి మాత్రం.. సర్దార్ లో ఒక ఐటెం ఖైదీలో ఒక ఐటెం చేశాక.. అసలు మామూలు ఆఫర్లు ఏవీ రావట్లేదట. హీరోయిన్ గా చేస్తావా? ఏదన్నా ముఖ్యమైన సైడ్ క్యారెక్టర్ చేస్తావా? అని ఎవ్వరూ అడగట్లేదట. అందరూ కూడా కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారని వాపోతోంది రాయ్ లక్ష్మీ.

ఒక్కసారి ఐటెం సాంగ్ చేసినా కూడా వరుసపెట్టి హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వడానికి తమన్నా అండ్ కాజల్ తరహాలో లక్ష్మీ రాయ్ స్టార్ హీరోయిన్ కాదు కాబట్టి.. అలా హీరోయిన్ ఛాన్సులు ఇవ్వలేం అంటున్నారు ఇండస్ర్టీవాసులు.