Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: న్యూడు న్యూడుగా!!

By:  Tupaki Desk   |   29 Aug 2017 10:19 AM GMT
టీజర్ టాక్: న్యూడు న్యూడుగా!!
X
చాలా సంవత్సరాల నుండి సౌత్ లో పెద్ద పెద్ద హిట్లు కొట్టాలని చూసిన నార్త్ భామ లక్ష్మీ రాయ్.. అస్సలు బ్రేక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. చివరాకరగా రాయ్ లక్ష్మి అని పేరు మార్చుకుని మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నెం 150 లో మెరిసిందీ అమ్మడు. కాకపోతే అక్కడేం పెద్దగా చేసిందీ లేదు. ఏదో అలా అలా ఐటెం సాంగులో చిందేసింది అంతే. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతూ.. పూర్తి స్థాయి రోల్ ఒకటి చేస్తోన్న సినిమాతో.. భారీ ఆశాలే పెంచుకుంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో జరీన్ ఖాన్.. సనా ఖాన్.. డైసీ షా.. ఇలా చాలామంది అవకాశాలు దక్కించుకోలేని భామలు.. బోల్డు లుక్కులో కనిపిస్తూ.. బికినీల్లోనే కాదు.. ఏకంగా కేవలం బ్రాలు ధరించి సీన్లు చేస్తూ.. సెమీ న్యూడ్ గా నటించేస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన 'జూలి' సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'జూలి 2' సినిమాలో ఇప్పుడు లక్ష్మీ రాయ్ అలాగే కనిపిస్తోంది. ఇక్కడ అమ్మడు బికినీలు వేసుకోవడం.. కావల్సినప్పుడు ఆ బికినీ టాప్ తీసేయడం.. సెమీ న్యూడ్ గా కనిపించడం.. టీజర్ అంతా ఈమె అందాలతోనే నింపేశాడు దర్శకనిర్మాత దీపక్ శివదాసాని. అండర్ వరల్డ్ తాలూకు నేకెడ్ త్రూత్ చెబుతానంటూ.. ఈ హీరయిన్ ను నెకెడ్ గా చూపించే ప్రయత్నం చేశాడు.

టీజర్ ను చూస్తే మాత్రం అందచందాలను ఆస్వాదించాలనుకనే వారికి సినిమా మంచి విందు భోజనంలా ఉండొచ్చేమో కాని.. తక్కిన వారికి మాత్రం సినిమాలో పెద్దగా కంటెంట్ అయితే కనిపించట్లేదు. మరి ట్రైలర్లోనైనా లక్ష్మీ రాయ్ అందాలు కాకుండా సినిమా కథేమన్నా చెబుతారేమో చూడాలి.