Begin typing your search above and press return to search.

బోల్డ్ బాడీ తప్ప అందులో ఏముందిలే

By:  Tupaki Desk   |   15 Feb 2016 4:59 AM GMT
బోల్డ్ బాడీ తప్ప అందులో ఏముందిలే
X
జూలీ2 వస్తోందంటూ కొన్ని రోజులుగా బోలెడంత హంగామా చేస్తున్నారు. పోస్టర్ల మీద పోస్టర్లు వేస్తూ తెగ ఊదరగొడుతున్నారు. 2004లో నేహాధూపియా నటించిన జూలీ చిత్రానికి ఇది సీక్వెల్. స్టోరీలో తేడా ఉన్నా.. ఇలా ఒకే కాన్సెప్ట్ తో తీసే సినిమాలకు సీక్వెల్ కలరింగ్ ఇవ్వడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది కాబట్టి.. అంతగా అబ్జెక్షన్స్ ఏమీ ఉండవు.

ఈ సినిమాలో సౌత్ భామ రాయ్ లక్ష్మీ లీడ్ హీరోయిన్ పాత్ర చేస్తుండడంతో.. దక్షిణాదిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకోంది. అయితే.. ఫస్ట్ లుక్ అంటూ ఇచ్చే పోస్టర్స్ విషయంలోనే ఆలోచించాలి. మొదట బీచ్ లో పడుకున్న హీరోయిన్ పోస్టర్. ఫేస్ కనిపించదు కానీ.. హీరోయిన్ ధరించిన ఓ బ్రా.. ప్యాంటీ కూడా కనిపించకుండా అడ్డం పెట్టిన పుస్తకం, మిగతాదంతా అనాచ్ఛాదితంగా వదిలేసిన శరీరం. ఇదీ జూలీ2 కోసం మొదట ఇచ్చిన పోస్టర్.

తర్వాత వచ్చిన రెండో పోస్టర్ కొంత నయం. వెనక్కి తిరిగిన హీరోయిన్, తెల్లటి ట్రాన్స్ పరెంట్ క్లాత్ వెనుక నుంచి కనిపించే అందాలు. అసలు ఏదో ఒకటి ఒంటిమీద వేసుకుందేమో అనుకోవాలంతే. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటూ జూలీ2కి ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. అసలు సినిమా గురించి ఏం చూపించారని దీన్ని ఫస్ట్ లుక్ అనాలో అర్ధం కాని విషయం. అదే అడిగితే చూసింది గోరంత, చూడాల్సింది కొండంత అంటాడేమో దర్శకుడు దీపక్ శివదాసాని.