Begin typing your search above and press return to search.

లక్ష్మి 'కళ' తప్పుతోందా?

By:  Tupaki Desk   |   15 Sep 2017 1:26 PM GMT
లక్ష్మి కళ తప్పుతోందా?
X

టాలీవుడ్ లో విజయాలు అంతగా దక్కకపోయినా అందమైన లక్ష్మి రాయ్ అందంలో అందరిని ఆకట్టుకుంది. అయితే అమ్మడు ఛాన్సులు దక్కపోయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు. అందంపై ద్రుష్టి పెట్టి మూడు పదుల వయస్సు దగ్గరపడుతున్నా ఇంకా ఇరవై ఏళ్ల కూడా దాటని మగువ అనిపించేలా అందరిని ఆకర్షించింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో స్పెషల్ సాంగ్స్ తో రెచ్చిపోయి మళ్ళీ గాడిలో పాడటానికి తెగ ప్రయత్నాలు చేసింది.

అయితే ఆమె కష్టానికి సరైన అవకాశం జూలీ 2 ద్వారా వచ్చింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దీపక్ ఈ సినిమాను కేవలం లక్ష్మి రాయ్ ని నమ్ముకొని తీశాడు. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా లక్ష్మి రాయ ఈ సినిమాతో దాటేయాల్సిన అన్ని హద్దులు ఈజీగా దాటేసింది. ట్రైలర్ తో అమ్మడు అందరికి దిమ్మ తిరిగేలా చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ కి లక్ష్మికి అంతగా గుర్తింపు లేదు కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇప్పుడు అక్కడ అందరు జూలీ 2 అందాల రాశి పేరేంటి అని అడుగుతున్నారు. దీంతో సినిమాకు ఇంకాస్త ప్రమోషన్స్ తేవాలని లక్ష్మి ఇంకో స్థాయిలో రెచ్చిపోవడానికి రెడీ అయిపోయింది. సినిమా వచ్చే నెల 6న రిలీజ్ అవుతుండడంతో అప్పటివరకు సినిమాను గురించే మాట్లాడుకోవాలని అమ్మడు అందాలని ఎరగా వేస్తోంది. ఏ మాత్రం హద్దులు లేకుండా టాప్ లెస్ అందాలతో దర్శనం ఇస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అమ్మడు వంటినిండా రంగులతో ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఓ బికినీ వేసుకుంది. పైన అందాలను మాత్రం చేతితో అడ్డుపెట్టుకొని కుర్రాళ్ళ గుండెల్ని అందాలతోనే పిండేస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు అమ్మడు ప్రతి రోజు తన అందాలని ఈ తరహాలో ఆరబోస్తుందట. మరి ఈ అందాల ప్రదర్శన సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.