Begin typing your search above and press return to search.

జూలీ 2లో అమ్మడు రెచ్చిపోతోందంతే

By:  Tupaki Desk   |   8 Dec 2015 4:53 AM GMT
జూలీ 2లో అమ్మడు రెచ్చిపోతోందంతే
X
బాలీవుడ్‌ లో జూలీ మూవీ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌. ఈ సినిమాతోనే నేహా ధూపియా అనే సెక్సీ స్టార్ ఉంద‌ని ప్ర‌పంచానికి తెలిసింది. ఈ ఒక్క మూవీతో ద‌శాబ్ధం కెరీర్‌ ని సునాయాసంగా లాగించేసింది అమ్మ‌డు. ఆ స్థాయి విజ‌యం ద‌క్కింది. ఒక్క ఐడియా చాలు జీవితాన్ని మార్చేయ‌డానికి అన్న‌ట్టే జూలీ లాంటి ఒక్క సినిమా చాలు అని ప్రూవ్ అయ్యింది. ఉత్త‌రాదిన విజ‌యం సాధించిన జూలీ ఆ త‌ర్వాత సౌత్ లాంగ్వేజెస్‌ లోనూ రిలీజై కాసుల వ‌ర్షం కురిపించింది. నేహా ధూపియా పెర్ఫామెన్స్‌ లో ఈజ్ యూత్‌ కి మ‌త్తెక్కించింది. అస‌లు ఎక్స్‌ పోజింగ్ అనే ప‌దానికి స‌రిహ‌ద్దులు చెరిపేసిన తార‌గా గుర్తింపు పొందింది. రీజ‌న్ ఏదైనా జూలీ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌.

ఇప్పుడు జూలీ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కుతోంది. అయితే ఈసారి హీరోయిన్ నేహా ధూపియా కాదు. రాయ్ ల‌క్ష్మి. ఒక సౌత్ హీరోయిన్‌ ని ఎంపిక చేసుకుని దీప‌క్ ఈ చిత్రాన్ని తీస్తున్నాడన్న‌ది హాట్ టాపిక్ ఇప్పుడు. ఈ మూవీలో ల‌క్ష్మి రాయ్ బికినీలో క‌నిపించ‌నుంది. హీరోగా రేసుగుర్రం ఫేం ర‌వికిష‌న్ న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఇందులోని ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఆన్‌ సెట్స్ ఫోటోలు నెట్‌ లో లీక‌య్యాయి. జూలీగా రాయ్ ల‌క్ష్మి విన్యాసాలు ఓ రేంజులో ఉంటాయ‌న్న సంగ‌తిని ఈ ఫోటోలే చెబుతున్నాయ్‌. నేహాని మించి రాయ్ ల‌క్ష్మిలోని అందాలు తెర‌పై క‌నువిందు చేస్తాయ‌ని చెబుతున్నారు. ఈ సినిమాతో ఉత్త‌రాదిన జాక్‌ పాట్ కొట్టేస్తుందేమో చూడాలి మ‌రి.