Begin typing your search above and press return to search.

ర‌త్తాలు పూల్ సైడ్ పార్టీ హీట్

By:  Tupaki Desk   |   19 Sep 2019 4:20 PM GMT
ర‌త్తాలు పూల్ సైడ్ పార్టీ హీట్
X
ర‌త్తాలు ఏం చేసినా ర‌చ్చ ర‌చ్చే. ఇటీవ‌ల గ‌త కొంత‌కాలంగా టీ-టౌన్ నుంచి మిస్స‌యిన ఈ బ్యూటీ ఏదోలా తిరిగి మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల అటెన్ష‌న్ త‌న‌వైపు తిప్పేసుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ ట్ర‌య‌ల్స్ ని ఎప్ప‌టిక‌ప్పుడు సామాజిక మాధ్య‌మాల ద్వారా రివీల్ చేస్తూనే ఉంది.

గ‌త కొంత‌కాలంగా ఈ అమ్మ‌డు నాన్ స్టాప్ గా వేడెక్కించే బికినీ ఫోటోల్ని.. స్విమ్ సూట్ లో పూల్ సైడ్ పార్టీ ఫోటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తోంది. ఓ గాళ్స్ గ్యాంగ్ ని వెంటేసుకుని నిరంతరం స్విమ్మింగ్ పూల్ పార్టీల‌తో బిజీగా ఉంటోంది. ఆ పోటోల్ని నిరంత‌రం షేర్ చేస్తోంది. ఈ ఫోటోల్లో టూమ‌చ్ హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో ర‌త్తాలు ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. దీంతో అవి కాస్తా యువ‌త‌రంలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

రాయ్ ల‌క్ష్మీ ఇటీవ‌లే నాగిని చిత్రంతో తెలుగు-త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం ఝాన్సీ- సిండ్రెల్లా అనే రెండు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. క‌నీసం వీటిలో అయినా ఏదో ఒక‌టి హిట్ట‌యితే క్రేజు వ‌స్తుందేమో. ఈలోగా ఐటెమ్ నంబ‌ర్ల‌లో అయినా ఛాన్సుల కోసం ఇదిగో ఇలా పూల్ సైడ్ యాక్టివిటీస్ తో వ‌ల‌లు వేస్తోంది.