Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కత్తిలాంటి బికినీలో రత్తాలు

By:  Tupaki Desk   |   1 Sep 2019 4:58 PM GMT
ఫోటో స్టొరీ: కత్తిలాంటి బికినీలో రత్తాలు
X
రాయ్ లక్ష్మి పేరు తెలియని తెలుగు మేథావులు చాలామంది ఉంటారేమో కానీ మాస్ ప్రేక్షకులు మాత్రం ఉండరు. ఒకవేళ వారికి రాయ్ లక్ష్మి అనే పేరు చెప్తే గుర్తు పట్టలేకపోవచ్చు కానీ 'రత్తాలు' అంటే చాలు టక్కున ఎవరో చెప్పేస్తారు. సౌత్ లో అన్నీ భాషల్లో నటించిన ఈ బ్యూటీ హిందీలో కూడా తన లక్కును టెస్ట్ చేసుకుంది. లీడ్ రోల్స్ లో నటిస్తూనే.. గ్లామర్ చిందించే ఐటెమ్ బ్యూటీగా స్టెప్పులు వేయడం కూడా రాయ్ లక్ష్మీకే సాధ్యం. ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్.. ఒకే ఫోటోతో అమెజాన్ ఫారెస్ట్ ఫైర్ లాంటి కార్చిచ్చును సోషల్ మీడియాలో పెట్టి.. ఆక్సిజన్ సప్లై తగ్గించి నెటిజన్లను ఊపిరాడకుండా చేయగల టాలెంట్ ఉంది.

తాజాగా అలాంటి ప్రయోగాన్నే చేపట్టింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "జీవితానికి పరమార్థం ఏంటంటే ఒక పరమార్థం కోసం జీవించడం." ఇదేదో డీప్ ఫిలాసఫీ లాగా అనిపిస్తోంది కదా? నిజంగానే జీవితంలో ఎంతో లోతు చూసినవారే ఇలాంటి వేదాంతం చెప్పగలరు. లేదా గూగుల్ లో కొటేషన్లు లటుక్కున కాపీ పేస్ట్ చేసేవారు మాత్రం ఎంచక్కా చెప్పగలరు! అయితే మీనింగ్ చెప్పమంటే మాత్రం డెప్త్ లేనివారు గుడ్లు తేలేస్తారు. సరేలెండి.. ఈ గోల మనకెందుకు? ఫోటో విషయానికి వస్తే ఒక కత్తి లాంటి బ్లాక్ బికినీ ధరించి ఒక స్విమ్మింగ్ పూల్ ఒడ్డున రిలాక్సింగ్ బెడ్ పైన వయ్యారంగా కూర్చుని వగలరాణిలా నవ్వేసింది. పట్టులాంటి చర్మం.. బంగారు రంగు జుత్తు.. ముత్యాల్లాంటి పలువరుస.. బ్యూటీకి కరెక్ట్ డెఫినిషన్ లా ఉంది. బ్లాక్ గాగుల్స్ ధరించి స్టైల్ ను మరింతగా పెంచేసింది.

ఒక్క గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేకుండా పర్ఫెక్ట్ షేప్ లో ఉంది. ఫోటోను కనుక గమనించి చూస్తే.. అసలు బికినీ వేయడం కోసమే రాయ్ లక్ష్మి ఈ భూలోకానికి వచ్చిందా అని కళాపోషణ ఉండే మేథావులు ఎవరికైనా అనుమానం రావడం ఖాయం. ఈ ఫోటోకు రెస్పాన్స్ కూడా అదిరింది. "డ్యామ్ హాట్.. కిల్లర్ లేడీ".. "ఊల్లాల్లా.. ఝకాస్ పోజ్".. "హాట్ థండర్ థైస్".. "సూపర్ సెక్సీ లెగ్స్" అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ.. కన్నడలో 'ఝాన్సి IPS' అని మూవీలోనూ నటిస్తోంది.