Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అరిటాకు రంగు డ్రెస్సులో వడ్డించింది!

By:  Tupaki Desk   |   10 July 2019 2:39 PM GMT
ఫోటో స్టొరీ: అరిటాకు రంగు డ్రెస్సులో వడ్డించింది!
X
తెలుగు ప్రేక్షకులకు రాయ్ లక్ష్మిని పరిచయం చేయనవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా ఆమె తెలియకపోతే 'ఖైది నెం. 50' సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'రత్తాలు రత్తాలు' పాటకు స్టెప్పులు వేసిందని ఇంట్రో ఇస్తే చాలు.. ఇట్టే గుర్తు పట్టేస్తారు. అవన్నీ పక్కన పెట్టేస్తే రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో యమా యాక్టివ్. సూపర్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ మంటలు పెట్టగల దిట్ట.

తాజాగా మరోసారి అదే పని చేసింది. ఒక కత్తిలాంటి ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "మీరు మీ పర్సనాలిటీకి ఫోటో షాప్ చెయ్యలేరు" అంటూ కసక్కు క్యాప్షన్ ఇచ్చింది. నిజమే.. మీ మొహానికి.. శరీరానికి ఎన్ని ఫిల్టర్లయినా తగిలించగలరు కానీ యాటిట్యూడ్ కు మాత్రం ఒరిజినల్.. ఎంత నటించినా ఏదో ఒకరోజు బయటపడక తప్పదు. ఇక ఫోటో సంగతి మాట్లాడుకుంటే ఈ ఫోటో తీసింది మాల్టాలో. బాలీవుడ్ సింగర్.. దలేర్ మెహెంది సోదరుడు మికా సింగ్ కంపోజ్ చేసి పాడుతున్న పాట చిత్రీకరణలో పాల్గొందట. ఈ పాట చిత్రీకరణలో రాయ్ లక్ష్మితో పాటుగా మరో బ్యూటీ షమ సికందర్ కూడా పాల్గొందట. ఆ షూటింగ్ లొకేషన్ నుంచి పైనున్న ఫోటోను తన అభిమాన నెటిజన్లకు వడ్డించింది.

లేత అరిటాకు రంగు డ్రస్ లో అమిత సౌందర్యవతిలా.. అల్ట్రా స్టైలిష్ మోడల్ లా కూర్చుంది.. ఆ డ్రెస్ బికినీ కి కొంచెం పొడవాటి వెర్షన్ లాగా ఉంది. కళ్ళకు గాగుల్స్ ధరించి సెన్సువల్ పోజిస్తూ వయ్యారంగా కూర్చుంది. నేపథ్యంలో దూరంగా నీలం సముద్రం ఈ ఫోటో అందాన్ని మరింతగా పెంచింది. పేరుకు అరిటాకు రంగు డ్రస్సు వేసుకుంది .. కానీ ఆ సున్నితమైన అరిటాకు అందం మగ నెటిజనుల హృదయాన్ని ఎర్రగా కాల్చుకు తినేలా ఉంది.

ఈ ఫోటోకు చాలా కామెంట్లు వచ్చాయి కానీ ఒకటే చెప్పుకుందాం "నీకు ఫోటోషాపులు.. ఫిల్టర్లు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అల్టిమేట్ బ్యూటీ". ఇక రత్తాలు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ.. కన్నడలో 'ఝాన్సి' అని మూవీలోనూ నటిస్తోంది.