Begin typing your search above and press return to search.

ర‌త్తాలు అన్ లిమిటెడ్ బికినీ ట్రీట్

By:  Tupaki Desk   |   10 May 2019 5:52 AM GMT
ర‌త్తాలు అన్ లిమిటెడ్ బికినీ ట్రీట్
X
గ‌త కొంత‌కాలంగా రాయ్ ల‌క్ష్మి సోష‌ల్ మీడియాలో ప్ర‌ద‌ర్శిస్తున్న దూకుడు తెలిసిందే. అక్క‌డ రెగ్యుల‌ర్ గా బికినీ ట్రీట్ తో అభిమానుల‌కు కంటిపై కునుకుప‌ట్ట‌నీకుండా చేస్తోంది. బ‌ర్త్ డే వేడుక‌లు పేరుతో కొంద‌రు స్నేహితురాళ్ల‌ను వెంటేసుకుని బ్యాంకాక్ .. థాయ్ ల్యాండ్ లాంటి చోట్ల బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో వేడెక్కిస్తోంది. ఇప్ప‌టికే రాయ్ ల‌క్ష్మీ బికినీ ఫోటోలు అంత‌ర్జాలంలో అగ్గి రాజేశాయి.

ఈ సిరీస్ నుంచి లేటెస్ట్ ఫోటోలు మ‌రోసారి నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాయ్ ల‌క్ష్మీ బ్లాక్ బికినీలో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఇచ్చిన ఫోజులు యూత్ ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి. ఐదున్న‌ర అడుగుల కామ‌సూత్రాన్ని త‌ల‌పిస్తున్న రాయ్ ల‌క్ష్మీ ఫోజులు గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది అంటూ ఫ్యాన్స్ ఒక‌టే కామెంట్లు రువ్వుతున్నారు. ర‌త్తాలు అన్ లిమిటెడ్ బికినీ ట్రీట్ అంటూ ఆ ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తున్నారు.

ఈ అమ్మ‌డి కెరీర్ మ్యాట‌ర్స్ ప‌రిశీలిస్తే.. నాగ‌క‌న్య చిత్రంలో నాగిని పాత్ర‌లో మెర‌వ‌బోతోంది. ఇదే చిత్రం త‌మిళంలో నీయ 2 పేరుతో రిలీజ‌వుతోంది. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ ఎగ్జ‌యిట్ మెంట్ పెంచింది. రాయ్ ల‌క్ష్మీ.. కేథ‌రిన్ థ్రెసా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ముగ్గురూ నాగిని పాత్ర‌ల్లో ర‌క్తి క‌ట్టిస్తున్నారు. జై ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించారు. ప్రేమించిన కుర్రాడి కోసం ప‌గ ప్ర‌తీకారంతో ర‌గిలిపోయే నాగిని పాత్ర‌లో రాయ్ ల‌క్ష్మీ న‌టించ‌డం ఆస‌క్తిక‌రం. ఈనెల 10న సినిమాని ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.