Begin typing your search above and press return to search.

ఐటెం సాంగ్స్ అడ్రెస్ గా మారిన భామ

By:  Tupaki Desk   |   30 Jan 2017 6:02 AM GMT
ఐటెం సాంగ్స్ అడ్రెస్ గా మారిన భామ
X
మన సౌత్ సినిమాలలో ఐటెం సాంగ్ల విశిష్టత వేరు. మొదట్లో మాస్ ని అలరించడానికి మాత్రమే పరిమితమైన ఈ పాట ఇప్పుడు ప్రెస్టేజ్ స్టేటస్ గా మారింది. పెద్ద హీరోల చిత్రాలకు తప్పనిసరి డోస్ గా ఐటెం పాట మారింది. ఈ పధ్ధతిని ఇప్పుడు బాలీవుడ్ సినిమాలలోనూ ఫాలో అవ్వడం గమనార్హం.

అయితే ఐటెం సాంగ్స్ లో మెలికలు తిరిగే సోయగాలను వెతకడంమాత్రం కాస్త కష్టమైన అంశమే. ఈ ఫీల్డ్ లో మొమైత్ ఖాన్ ఒక ఊపు ఊపిన తరువాత ఆ ప్లేస్ ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. ఆ తరువాత తమన్నా - కాజల్ వంటి తారలు ఈ జోన్ లో నడిచి హిట్ కొట్టినా నిర్మాతలకు పెను భారంగా మారారు.

ఈ సమయంలో యువ నటి లక్ష్మీ రాయ్ ఐటెం సాంగ్స్ విభాగంలో రచ్చ లేపడం కలిసొచ్చే అంశం. బలుపులో రవితేజతో - సర్దార్ లో పవన్ కళ్యాణ్ సరసన - రీసెంట్ గా ఏకంగా మెగాస్టార్ తో ఖైదీ లో ఐటెం సాంగ్స్ కి చిందేసింది. అవన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ భామ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు తమిళనాట విడుదలవుతున్న మన పటాస్ రీమేక్ లో లారెన్స్ సరసన ఒక ఐటెం సాంగ్ తో ఇరగదీయనుంది. అందానికి అద్భుతమైన స్టెప్స్ సైతం తోడవ్వడంతో లక్ష్మీ రాయ్ ప్రస్తుతం ఈ ఫీల్డ్ లో రాజ్యమేలుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/