Begin typing your search above and press return to search.

లక్ష్మీపార్వతి ‘రాధాకృష్ణ’

By:  Tupaki Desk   |   22 Feb 2020 11:00 AM GMT
లక్ష్మీపార్వతి ‘రాధాకృష్ణ’
X
సినీ నటుడు.. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు భార్య లక్ష్మీ పార్వతి ఆయన మరణానంతరం కూడా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆమె వైకాపాలో ఉన్నారు. ఆమెకు ఇటీవలే సీఎం జగన్‌ నామినేటెడ్‌ పదవి కూడా ఇచ్చారు. రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా లక్ష్మీ పార్వతి తాజాగా ‘రాధాకృష్ణ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమెది కీలక పాత్ర కాగా అనురాగ్‌.. ముస్కాన్‌ శెట్టి జంటగా నటిస్తున్నారు.

ప్రసాద్‌ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు శ్రీనివాసరెడ్డి సమర్పణలో సాగరిక శ్రీనివాస్‌ కానురులలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బర్నీంగ్‌ స్టార్‌ సంపూర్నేష్‌ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంను నిర్మల్‌ కొయ్య బొమ్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.

హృదయానికి హత్తుకునే ప్రేమ కథతో విభిన్నమైన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. షూటింగ్‌ చక చక జరుగుతోంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. ఈ సినిమాలో కృష్ణభగవాన్‌ జబర్దస్త్‌ చమ్మక్‌ చంద్ర ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.