Begin typing your search above and press return to search.

బాలయ్యపై లక్ష్మీ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   9 Jan 2019 12:34 PM GMT
బాలయ్యపై లక్ష్మీ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు
X
బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నటించిన ‘ఎన్టీఆర్‌’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్బంగా ఎన్టీఆర్‌ రెండవ భార్య లక్ష్మీ పార్వతి స్పందించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ పూర్తిగా చంద్రబాబు నాయుడు కను సన్నల్లో తెరకెక్కిందన్నారు. బాలకృష్ణ మంచి వ్యక్తి, కాని ఆయన చంద్రబాబు నాయుడుకు భయపడి ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో అవాస్తవాలను చూపించాడని లక్ష్మీ పార్వతి అన్నారు. బాలకృష్ణ భయస్తుడు అవ్వడం వల్లే చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వింటున్నాడని కూడా లక్ష్మీ పార్వతి ఆరోపణలు చేసింది.

స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన వాస్తవాలను చూపించే ధైర్యం కేవలం రామ్‌ గోపాల్‌ వర్మకు మాత్రమే ఉందని లక్ష్మీ పార్వతి అన్నారు. వర్మ తాజాగా విడుదల చేసిన ఎందుకు పాట విన్న తర్వాత వర్మపై తనకు మరింత నమ్మకం కలిగిందని, అదే విధంగా ఆయనపై గౌరవం పెరిగిందన్నారు. వర్మ తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ లో ఎన్టీ రామారావు గారి గురించి పూర్తిగా నిజాలు చూపిస్తారనే నమ్మకం తనకుందని చెప్పుకొచ్చారు.

‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌ లలో కూడా ఎన్టీఆర్‌ ను చూపించే ఛాన్సే లేదని, అన్ని కూడా అబద్దాలే ఆ సినిమాల్లో చూపించబోతున్నారని లక్ష్మీ పార్వతి అన్నారు. బాలకృష్ణ తీసిన ‘ఎన్టీఆర్‌’ చిత్రంపై నిజమైన ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆసక్తి లేదని, వారంతా కూడా వర్మ తీస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని లక్ష్మీ పార్వతి అంది. మరో వైపు నందమూరి అభిమానులు మాత్రం ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సూపర్‌ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ కు నిజమైన నివాళ్లు అంటూ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రంపై వర్మ రియాక్షన్‌ ఏంటో చూడాలి.