Begin typing your search above and press return to search.

క్రేజీ ఫైట్ మాస్ట‌ర్స్ తో లారెన్స్

By:  Tupaki Desk   |   8 Jan 2022 1:30 AM GMT
క్రేజీ ఫైట్ మాస్ట‌ర్స్ తో లారెన్స్
X
ర‌జ‌నీకాంత్ న‌టించిన త‌మిళ చిత్రంతో అసిస్టెంట్డ్ డ్యాన్స‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన రాఘ‌వ లారెన్స్ క్రేజీ డ్యాన్స్ మాస్ట‌ర్ గా, డైరెక్ట‌ర్‌గా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. సంగీత ద‌ర్శ‌కుడిగానూ త‌న స‌త్తా చాటి బ‌హుముఖ ప్ర‌తిభ‌ని చాటుకున్నారు. `ముని`తో లారెన్స్ న‌ట ప్ర‌స్థానం ట్రాక్‌లోకి వ‌చ్చేసింది. ఆ త‌రువాత ఈ సిరీస్ చిత్రాలతో బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వర్షం కురిపించి హార‌ర్, థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచాడు. డ్యాన్స్ మాస్ట‌ర్ గా ఎంత పేరు తెచ్చుకున్నాడో ద‌ర్శ‌కుడిగా అంత‌కు మించి పేరు సంపాదించుకున్నాడు.

`ముని` సిరీస్ చిత్రాల్లో భాగంగా రూపొందించిన `కాంచ‌న -3` త‌రువాత కొంత గ్యాప్ ఇచ్చారు లారెన్స్. ఆయ‌న నుంచి సినిమా వ‌చ్చి మూడేళ్ల‌వుతోంది. ఇదిలా వుంటే తాజాగా లారెన్స్ రెండు మూడు చిత్రాల్ని బ్యాక్ టు బ్యాక్ రెడీ చేసే ప‌నిలో బిజీ అయిపోయారు. ఇందులో `రుద్ర‌న్‌`, అధిగారం` చిత్రాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. ఇందులో హాట్ టాపిక్ గా నిలిచిన చిత్రం `దుర్గ‌`. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి లారెన్స్ కు సంబంధించిన లుక్ ని విడుద‌ల చేశారు.

ఆ లుక్ చూసిన ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. ఏంటిది లారెన్సేనా? అని..అనుమానం వ్య‌క్తం చేశారు కూడా. ముస‌లి అవ‌తారంలో అంత చిత్రంగా వుంది లారెన్స్ లుక్‌. ఈ స్టిల్ చూసిన వాళ్ల‌లో చాలా మంది మ‌ళ్లీ కాంచ‌నకు మ‌రో సీక్వెల్ ని లారెన్స్ రెడీ చేస్తున్నాడ‌ని అంతా అనుకున్నారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. లారెన్స్ కూడా స్పందించ‌లేదు.

ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన తాజాగా ఓ షాకింగ్ విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. తాజా చిత్రానికి లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం లేద‌ని, తాను ఆ బాధ్య‌త‌ల్ని మ‌రో ఇద్ద‌రు క్రేజీ ద‌ర్శ‌కుల‌కు అప్ప‌గించార‌ని తెలిసింది. ఆ ఇద్ద‌రూ కోలీవుడ్ క్రేజీ ఫైట్ మాస్ట‌ర్స్ అన్బు - అరివు. విశేషం ఏంటంటే వీరిద్ద‌రు క‌ల‌వ‌ల‌లు. అంతే కాకుండా తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో వీరు బాగా పాపుల‌ర్ ఫైట్ మాస్ట‌ర్స్‌. అయితే డైరెక్ష‌న్ మాత్రం కొత్తే. అయినా ఈ ఇద్ద‌రు క‌ల‌వ‌ల సోద‌రుల‌నే లారెన్స్ త‌న తాజా చిత్రానికి డైరెక్ట‌ర్స్ గా ఎంచుకున్నారు.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `క‌బాలి` సినిమాతో ఫైట్ మాస్ట‌ర్స్ గా కెరీర్ ప్రారంభించిన వీరు `కెజీఎఫ్‌`తో దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు. ఆ త‌రువాత ప‌లు క్రేజీ చిత్రాల‌కు యాక్ష‌న్ డైరెక్ట‌ర్స్ గా వ‌ర్క్ చేసిన వీరు ప్ర‌స్తుతం `బీస్ట్` మూవీకి వ‌ర్క్ చేస్తున్నారు. ఫైట్ మాస్ట‌ర్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్ద‌రు ట్విన్స్‌ని త‌న థ్రిల్ల‌ర్ మూవీకి లారెన్స్ డైరెక్ట‌ర్స్ గా ఎంచుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ క్రేజీ ఫైట్ మాస్ట‌ర్స్ తో లారెన్స్ ఎలాంటి ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతున్నాడు?. ఈ సారి ఏ రేంజ్ లో భ‌య‌పెట్టబోతున్నాడో అని త‌మిళ, తెలుగు ఇండ‌స్ట్రీల్లో హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. లారెన్స్ ఈ ఇద్ద‌రితో ప్ర‌యోగం చేయ‌బోతున్నాడా? లేక ముని సిరీస్ ల‌కు మించి థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ తో భ‌య‌పెట్ట‌బోతున్నాడా? అన్న‌ది తెలియాలంటే ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.