Begin typing your search above and press return to search.

లారెన్స్‌తో మళ్లీ అదే గొడవ

By:  Tupaki Desk   |   16 March 2015 9:30 AM GMT
లారెన్స్‌తో మళ్లీ అదే గొడవ
X
కొరియాగ్రాఫర్‌ టర్న్‌డ్‌ డైరెక్టర్‌ లారెన్స్‌ బయట సేవా కార్యక్రమాలకు బోలెడన్ని డబ్బులు ఖర్చు చేస్తుంటాడు కానీ.. నిర్మాతల దగ్గరికి వచ్చేసరికి డబ్బుల విషయంలో చాలా గొడవ చేస్తుంటాడని పేరుంది. దర్శకుడిగా అతను చేసిన సినిమాల్లో చాలా వాటికి ఆర్థిక పరమైన విషయాల్లో తేడా వచ్చింది. స్టైల్‌ సినిమాను తమిళంలో విడుదల చేసే విషయంలో ప్రభుదేవాతో గొడవ పడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత రెబల్‌ సినిమా విషయంలో ఎంత రచ్చయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. విపరీతంగా బడ్జెట్‌ పెంచేసి.. నిర్మాతలకు భారీ నష్టాలు మిగల్చడం.. వాళ్లు లారెన్స్‌ పై కేసు పెట్టడం తెలిసిన విషయమే. ఇప్పుడు లారెన్స్‌ కొత్త సినిమా కాంఛన-2 విషయంలోనూ రచ్చ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

రెబల్‌ తర్వాత లారెన్స్‌తో సినిమా తీయడానికి అందరూ భయపడుతున్న సమయంలో ధైర్యంగా అతడితో కాంఛన తీశాడు బెల్లంకొండ. అందుకు మంచి ఫలితమే దక్కింది. బెల్లంకొండ భారీ లాభాలు మిగుల్చుకున్నాడు. దీంతో మళ్లీ కాంఛన-2ను కూడా అతనే నిర్మించాడు. ఈ సినిమా కోసం రూ.10 కోట్ల బడ్జెట్‌ ఇచ్చాడు బెల్లంకొండ. ఐతే చాలా కారణాల వల్ల షూటింగ్‌ బాగా డిలే కావడం.. లారెన్స్‌ విపరీతంగా ఖర్చు పెట్టడంతో బడ్జెట్‌ బాగా పెరిగిందట. అంతేకాక విడుదలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు తనకు పారితోషకంతో పాటు తమిళ వెర్షన్‌ చెన్నై హక్కులు కూడా కావాలని పట్టుబడుతున్నాడట లారెన్స్‌. ఐతే అల్లుడు శీను, రభస సినిమాలు కొట్టిన దెబ్బకు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు బెల్లకొండ. కాంఛన-2తో అయినా బయటపడదామనుకుంటే లారెన్స్‌ ఇలా ఫిట్టింగులు పెడుతున్నాడట. ఈ గొడవతో కాంఛన-2 అనుకున్న సమయానికి విడుదలవుతుందా అని సందేహాలు నెలకొంటున్నాయి.