Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ పాదాలు ట‌చ్ చేసిన రాఘ‌వ‌ లారెన్స్‌!

By:  Tupaki Desk   |   15 July 2022 7:30 AM GMT
సూప‌ర్ స్టార్ పాదాలు ట‌చ్ చేసిన రాఘ‌వ‌ లారెన్స్‌!
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన కామెడీ హార‌ర్ మూవీ 'చంద్ర‌ముఖి'. 2005లో విడుద‌లైన ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. పి. వాసు ద‌ర్శ‌క‌త్వంలో శివాజీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై హీరో ప్ర‌భు, ఆయ‌న సోద‌రుడు రామ్ కుమార్ గ‌ణేష‌న్ క‌లిసి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. వ‌రుస ఫ్లాప్ ల‌లో వున్న సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ కు ఈ మూవీ గ్రాండ్ క‌మ్ బ్యాక్ గా నిలిచి ఆయన స్టార్ డ‌మ్ ని మ‌ళ్లీ గాడిలో పెట్టింది.

ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తో ర‌జ‌నీని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత ఈ సినిమాకు సీక్వెల్ గా 'చంద్ర‌ముఖి 2' పేరుతో ఓ భారీ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. పి. వాసు ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సుభాస్క‌ర‌ణ్ ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ని ఇటీవ‌ల లైకా వ‌ర్గాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ఈ నేప‌థ్యంలో 'చంద్ర‌ముఖి' ఫ‌స్ట్ ఒరిజిన‌ల్ వెర్ష‌న్ హీరో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని హీరో రాఘ‌వ లారెన్స్ శుక్ర‌వారం చెన్నైలోని ఆయ‌న నివాసంలో మ‌ర్య‌దపూర్వ‌కంగా క‌లుసుకున్నారు. చంద్ర‌ముఖి సీక్వెల్ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ర‌జ‌నీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా లారెన్స్ మోకాళ్ల‌పై ప‌డుకుని న‌మ‌స్కారం చేస్తూ ర‌జ‌నీ పాదాల‌ని తాక‌డం విశేషం.

దీనికి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా లారెన్స్ అభిమానుల‌తో పంచుకున్నారు. 'హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్‌.. ఈ రోజు 'చంద్ర‌ముఖి 2' రెగ్యుల‌ర్ షూటింగ్ నా త‌లైవ‌ర్‌, నా గురు ర‌జ‌నీకాంత్ ఆశీర్వాదంతో మైసూర్ లో మొద‌లైంది.

ఈ సంద‌ర్భంగా అంద‌రి ఆశీస్సులు కూడా కావాల‌ని కోరుకుంటున్నాను' అంటూ లారెన్స్ త‌ను ర‌జ‌నీకి సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తున్న ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఈ చిత్రంలోని ఓ కీల‌క పాత్ర‌లో క‌మెడియ‌న్ వ‌డివేలు న‌టిస్తుండ‌గా ఈ మూవీకి ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్ డి. రాజ‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం, ప‌ద్మ‌శ్రీ తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ సీక్వెల్ ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జూలై 15 శుక్ర‌వారం మైసూర్ లో మొద‌లైంది.