Begin typing your search above and press return to search.

మళ్లీ నాగ్‌తో లారెన్స్‌?

By:  Tupaki Desk   |   8 Jun 2015 5:00 PM IST
మళ్లీ నాగ్‌తో లారెన్స్‌?
X
డ్యాన్స్‌ డైరెక్టర్‌కు స్టార్‌ ఇమేజ్‌ అందుకుని.. అప్పుడప్పుడూ తెరమీద తళుక్కుమంటూ వచ్చిన రాఘవ లారెన్స్‌ దర్శకుడవుతాడని ఎవరూ ఊహించలేదు. అందులోనూ నాగార్జున లాంటి స్టార్‌ హీరో తన సొంత సంస్థ ద్వారా లారెన్స్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తాడని.. తనే హీరోగా నటిస్తాడని.. అసలేమాత్రం ఊహించి ఉండరు. కానీ అదే జరిగింది. లారెన్స్‌ తొలి సినిమా 'మాస్‌' సూపర్‌ హిట్టయి.. అతడికి సక్సెస్‌ఫుల్‌ ఎంట్రీ ఇచ్చింది. నాగ్‌తో ఆ తర్వాత 'డాన్‌' అనే ఇంకో సినిమా చేశాడు కానీ అది నిరాశపరిచింది. దర్శకుడిగా ఆ తర్వాత కూడా ఎదురు దెబ్బలు తిన్నాడు కానీ.. కాంఛన-2 (గంగ) సెన్సేషనల్‌ హిట్టవడంతో రెండు ఇండస్ట్రీల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు లారెన్స్‌.

లారెన్స్‌ ఓకే అంటే సినిమా చేయడానికి చాలామంది నిర్మాతలు, హీరోలు రెడీగా ఉన్నారు. ఐతే అతను మాత్రం రజినీకాంత్‌తో సినిమా కోసం ప్రయత్నాలు చేశాడు. కానీ అవి ఫలించలేదు. దీంతో మళ్లీ తన ఫేవరెట్‌ హీరో నాగార్జునతో ఓ సినిమాకు తయారవుతున్నాడని సమాచారం. ఇటీవలే నాగ్‌ను కలిసి ఓ లైన్‌ కూడా వినిపించాడట. ఆయనకు నచ్చిందని.. పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకుని రమ్మని చెప్పాడట. లారెన్స్‌ ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాడు. నాగ్‌ ప్రస్తుతం 'సోగ్గాడే చిన్నినాయనా'తో పాటు కార్తి కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్‌ చేస్తున్నాడు. ఇదయ్యాక లారెన్స్‌ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లే అవకాశముంది.