Begin typing your search above and press return to search.

ఖైదీ నెంబర్ 150లో లారెన్స్ ఇదిగో..

By:  Tupaki Desk   |   13 Oct 2016 1:30 PM GMT
ఖైదీ నెంబర్ 150లో లారెన్స్ ఇదిగో..
X
ఈ ఉదయం నుంచి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ గురించి రెండు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి ఈ సినిమాలోని ఐటెం పాట నుంచి కేథరిన్ థ్రెసాను తొలగించి లక్ష్మీరాయ్ కు అవకాశం ఇచ్చారు అన్నది.. ఇంకోటి ఈ పాటకు స్టార్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేస్తున్నాడన్నది. ముందు ఈ వార్తలు రూమర్లే అనుకున్నారు. కానీ సాయంత్రానికి అవే నిజమని తేలిపోయింది. చిరు పక్కన స్టెప్పులేసేది లక్ష్మీ రాయేనని యూనిట్ కన్ఫర్మేషన్ ఇవ్వగా.. ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నది లారెన్సే అనడానికి రుజువులు బయటికి వచ్చేశాయి.

‘ఖైదీ నెంబర్ 150’ సెట్లో లారెన్స్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి ప్రస్తుతం. ప్రస్తుతం తమిళంలో ‘మొట్ట శివ కెట్ట శివ’ అనే సినిమా చేస్తున్న లారెన్స్.. అందులోని గుండు గెటప్ తోనే ‘ఖైదీ నెంబర్ 150’ సెట్లోకి విచ్చేశాడు. తనకు లైఫ్ ఇచ్చిన మెగాస్టార్ తో స్టెప్పులు వేయించడానికి ఏర్పాట్లు చేసుకుంటూ కనిపించాడు. ఇంకా చిరు రంగంలోకి దిగాడో లేదో తెలియలేదు కానీ.. లారెన్స్ అయితే పని మొదలుపెట్టేశాడు. దాయి దాయి దామ్మా.. మన్మథా మన్మథా మామ పుత్రుడా లాంటి పాటలతో చిరు-లారెన్స్ కాంబినేషన్ అప్పట్లో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసింది. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఈ జోడీ రంగంలోకి దిగుతుండటంతో ‘ఖైదీ నెంబర్ 150’లో డ్యాన్సులపై అంచనాలు భారీగా పెరిగిపోవడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/