Begin typing your search above and press return to search.

సగం సొమ్ములు దెయ్యాల పాలు

By:  Tupaki Desk   |   22 April 2019 5:59 AM GMT
సగం సొమ్ములు దెయ్యాల పాలు
X
ఎవరు ఎన్ని విమర్శలు గుప్పించినా తీసిందే మళ్ళి తీశావేంటి అని లారెన్స్ ని నిలదీసినా బిసి సెంటర్స్ లో ఫస్ట్ వీకెండ్ కాంచన 3దే నడిచిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. కంటెంట్ లో కొత్తదనం లేకపోయినా మాస్ కి కావాల్సిన మసాలాలు కాస్త ఎక్కువ మోతాదులో దట్టించడంతో మంచి రిపోర్ట్స్ తెచ్చుకున్న జెర్సికి ధీటుగా వసూళ్లు రాబట్టిందని లెక్కలు చెబుతున్నాయి.

ఒకవేళ కాంచన 3 లేకుండా కేవలం జెర్సీ మాత్రమే బరిలో ఉండి ఉంటె వేరే ఆప్షన్ లేదు కాబట్టి క్లాస్ మాస్ తేడా లేకుండా అందరూ జెర్సికే ఓటు వేసేవారని లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కన సీడెడ్ ఆంధ్ర నైజాంలోని కొన్ని మాస్ సెంటర్స్ లో జెర్సికి రావాల్సిన షేర్ లో సగం పైగా కాంచన 3లోని దెయ్యాలు లాగేసుకున్నాయని చెబుతున్నారు

ఫస్ట్ వీక్ ఎండ్ లో రెండూ సేఫ్ రన్ కొనసాగించడం బయ్యర్లకు పెద్ద రిలీఫ్. జెర్సి మరీ తీవ్రంగా కాంచన 3ని ప్రభావితం చేయలేకపోవడం మరో ట్విస్ట్. అయితే నిజంగా ఏది సేఫ్ వెంచర్ అనేది ఈ రోజుతో మొదలయ్యే వీక్ డేస్ కలెక్షన్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. డ్రాప్ ఎవరికి ఎంత శాతంలో ఉందనే క్యాలికులేషన్ ఒక స్పష్టతనివ్వొచ్చు.

అయినప్పటికీ మాస్ కి అప్పీల్ అయ్యే ఎలాంటి అంశం జెర్సిలో పెద్దగా లేకపోవడం సి సెంటర్స్ లో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తోంది. అక్కడే కాంచన 3 ఎడ్జ్ తీసుకుంది. మొదటి రోజే కాంచన 3 సుమారు 3 కోట్ల 90 లక్షల దాకా షేర్ రాబట్టడాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. దెయ్యం వచ్చి నాని గ్రౌండ్ లో పాగా వేసినట్టు ఇది ఇక్కడితో ఆగుతుందా లేదా అనేది ఇంకో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది