Begin typing your search above and press return to search.

దెయ్యాల్ని వదిలేయ్ బాబాయ్!!

By:  Tupaki Desk   |   18 April 2017 5:40 AM GMT
దెయ్యాల్ని వదిలేయ్ బాబాయ్!!
X
డ్యాన్సర్ టు డ్యాన్స్ మాస్టర్.. యాక్టర్ టు డైరెక్టర్ కం హీరో.. ఇలా అంచెలంచెలుగా ఎదిగాడు లారెన్స్ రాఘవ. ఇప్పడు మాస్టర్ అని ముద్దుగా పిలిపించేసుకుంటున్నాడు. అయితే.. లారెన్స్ కు బాగా అచ్చొచ్చినవి మాత్రం దెయ్యాలే. ఆ దెయ్యం సినిమాలే ఈయనను హీరోగా ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి.

కానీ అవే దెయ్యాలు ఇప్పుడు మాస్టర్ ను ముంచేస్తున్నాయి. ముని అంటూ తమిళంలో కాంచన పేరుతో తెలుగులో.. వరుస సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాడు లారెన్స్. ఇప్పుడు శివలింగ అంటూ మరో దెయ్యం సినిమా చేశాడు. పి. వాసు దర్శకత్వంలో గతేడాది కన్నడలో వచ్చిన సినిమాకి ఇది రీమేక్. ఇది కూడా గంగ(ముని3) టైపులో దెయ్యం సినిమానే. ఇప్పటికే ఇలాంటి చాలా సినిమాలు లారెన్స్ నుంచి చూసేసిన జనాలకు.. ఇది పెద్దగా ఎక్కలేదు. మాస్ థియేటర్లలో సినిమా బాగానే ఆడుతున్నా.. ఆ వసూళ్లు మూవీని నిలబెట్టేసి హిట్ చేసేంతటి స్థాయిలో లేవు.రీసెంట్ గా మొట్ట శివ.. కెట్ట శివ(పటాస్ రీమేక్) ఫ్లాప్ తో లారెన్స్ కు ఎదురు దెబ్బ తగిలింది.

ఇప్పుడు దెయ్యం సినిమా శివలింగ కూడా ఆకట్టుకోలేకపోయింది. వరుసగా దెయ్యాలనే చూపిస్తుండడంతో జనాలకు కూడా మొహం మొత్తేసింది. అలాగని దెయ్యాలు కాకుండా.. వేరే సినిమాల్లో తనను తాను చూపించుకుని.. సక్సెస్ సాధించడం లారెన్స్ వ్లల కావడం లేదు. ఇప్పుడు ఆ దెయ్యాలను పూర్తిగా పక్కన పెట్టి.. కాసింత డిఫరెంట్ మూవీస్ ప్రయత్నించి.. ఇమేజ్ మార్చుకోకపోతే లో బడ్జెట్ దెయ్యాలతో సినిమాలు తీసుకుని.. ఏదో ఒక రకంగా సక్సెస్ అనిపించుకోవడం తప్ప.. హీరోగా మరో ఇమేజ్ సాధించడం కష్టమైపోతుందనే టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/