Begin typing your search above and press return to search.

భయంకర లారెన్స్ ఈజ్ బ్యాక్

By:  Tupaki Desk   |   24 Aug 2017 10:21 AM IST
భయంకర లారెన్స్ ఈజ్ బ్యాక్
X
భయంకర లారెన్స్ ఏంటి అంటారా? ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్ గా ఎంత పేరు సంపాదించాడో.. దర్శకుడిగా హార్రర్ కామెడీ సినిమాలతో అదే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు రాఘవ లారెన్స్. అతను తీసిన కాంఛన.. గంగ సినిమాలో ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హార్రర్ కామెడీ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి ఈ సినిమాలు. ‘ముని’తో మొదలుపెట్టి ఈ సిరీస్ లో మూడు సినిమాలు తీసిన లారెన్స్.. త్వరలోనే ఈ కోవలో మరో సినిమా చేయబోతున్నాడు. ‘గంగ’ బ్లాక్ బస్టర్ అయినప్పుడే ఈ సిరీస్ లో మరో సినిమా చేస్తానని ప్రకటించిన లారెన్స్.. గత రెండేళ్లలో ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయలేదు.

ఐతే ఈ సిరీస్ లో కొత్త సినిమా రాబోతోందని లారెన్స్ కన్ఫమ్ చేశాడు. రెండేళ్లకు పైగా దర్శకత్వం పక్కన పెట్టేసి హీరోగా మొట్టశివ కెట్ట శివ.. శివలింగ లాంటి సినిమాలు చేసిన లారెన్స్.. మళ్లీ కొత్త కథపై దృష్టిపెట్టాడు. ‘ముని’ సిరీస్ లో కొత్త సినిమాకు కథ రెడీ అవుతోందని.. త్వరలోనే వివరాలు ప్రకటిస్తానని లారెన్స్ ప్రకటించాడు. ఇంతకుముందు వేరే నిర్మాతల ప్రొడక్షన్లో ఈ సిరీస్ చేసిన లారెన్స్.. ఈసారి నిర్మాణ బాధ్యతలు కూడా తనే తీసుకుంటున్నాడట. ‘కాంచన’.. ‘గంగ’.. నిర్మాతలకు పెట్టుబడి మీద కొన్ని రెట్లు లాభాలందించాయి. ‘ముని’ సిరీస్ కొత్త సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించొచ్చని ఇంతకుముందు వార్తలొచ్చాయి. మరి లారెన్స్ ఆలోచనలు ఇప్పుడెలా ఉన్నాయో? కాజలే కథానాయికగా నటిస్తే ఈ సినిమాకు ముందే మంచి క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు.