Begin typing your search above and press return to search.

బాహుబలిలో రాక్షసి పాత్ర!!

By:  Tupaki Desk   |   3 Nov 2015 5:00 PM IST
బాహుబలిలో రాక్షసి పాత్ర!!
X
బాహుబలి కంటే.. బాహుబలి ది కంక్లూజన్ మరింత రసవత్తరంగా ఉంటుందనే విషయం ఇప్పటికే అర్ధమైంది. యుద్ధ సన్నివేశాల్లోనే కాదు.. అందాల విందులోనూ బాహుబలి సీక్వెల్ రెండడుగులు ముందే ఉంటుంది. అనుష్క గ్లామరస్ రోల్ మనం చూడబోయేది ఇందులోనే. ఇప్పుడు మరో అందాల భామను కూడా తీసుకోబోతున్నాడట జక్కన్న. టాలీవుడ్ లో అందాల రాక్షసిగా గుర్తింపు పొందిన లావణ్య త్రిపాఠికి బాహుబలి2కోసం తీసుకోవాలని యోచిస్తున్నారట.

అది కూడా భల్లాలదేవ పాత్రధారి రాణాకు జంటగా కావడం విశేషం. బాహుబలిలో రాణా ఉంటాడు, ఆయనకో కొడుకు రోల్ కూడా ఉంటుంది. కానీ.. భల్లాలదేవుని భార్య రోల్ చూపించలేదు. కథను మార్చే కీలకమైన రోల్ ఇదని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఇప్పుడు లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా నిర్మాత సాయి కొర్రపాటి లావణ్యను తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాడని టాక్. యాక్టింగ్ - ఫిజిక్ పరంగానూ లావణ్యకు మంచి మార్కులే ఉండడంతో.. రాజమౌళి కూడా మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. ఇంకా ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది.

ఒకవేళ కన్ఫాం అయితే మాత్రం.. బాహబలి రెండో భాగంలో అనుష్క - తమన్నా - లావణ్య.. ముగ్గురు భామలు అందాలను చూసే అవకాశం ప్రేక్షకులకు వస్తుంది. ఈ రోల్ కి ఎంపికయితే.. లావణ్య క్రేజ్ మరింతగా పెరుగుతుందనడంలో సందేహం అక్కర్లేదు.