Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : కారులో అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   1 Oct 2021 11:30 AM GMT
ఫొటోటాక్ : కారులో అందాల ఆరబోత
X
అందాల రాక్షసి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దశాబ్దం అవుతున్నా కూడా ఇప్పటికి ఈ అమ్మడి అందంకు జనాలు ఫిదా అవుతూనే ఉంటారు. లావణ్యంగా ఉంది అంటూ అంతా కూడా వావ్‌ అంటూ ఉంటారు. తాజాగా ఈ అమ్మడి అందాల ఆరబోత స్టిల్స్ సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా కనిపిస్తున్నాయి. సినిమాల్లో ఆఫర్లు వచ్చినా రాకున్నా కూడా నెట్టింట మాత్రం లావణ్య త్రిపాఠి అందాల వింధు ఫొటో షూట్స్ కనిపిస్తున్నాయి. నెట్టింట ఎప్పుడు కూడా హాట్ ఫొటో షూట్స్ ను షేర్‌ చేస్తూ ఉన్న ఈ అమ్మడు తాజాగా మరో సారి తన హాట్ ఫొటో షూట్‌ ను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈసారి ఈ అమ్మడి అందాల ప్రదర్శణ కారులో జరిగింది. క్రియేటివిటీగా అందంగా ఫొటోలకు ఫోజులు ఇచ్చే లావణ్య త్రిపాఠి ఇటీవల ఒక కెమెరా పట్టుకుని అందమైన థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఫొటోలు దించుతున్నట్లుగా పోజ్‌ ఇచ్చింది. ఫొటో షూట్‌ లో కెమెరా పట్టుకుని ఫొటోలకు ఫోజ్‌ ఇవ్వడం అంటే చాలా క్రియేటివిటీగా ఉందంటూ నెటిజన్స్ నుండి కామెంట్స్ దక్కించుకుంది. తాజాగా మరోసారి తన క్రియేటివిటీని కనబర్చింది. ఫొటో షూట్‌ అంటే బైక్ పై లేదా మరెక్కడైనా ఔట్‌ డోర్ లో ఉంటుంది. కాని ఈసారి లావణ్య కారులో కూర్చుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

కారులో ఉండి అందంగా కనిపిస్తూ అందాల ప్రదర్శణ చేయడం అంటే పెద్ద టాస్కే. ఆ విషయంలో ఈ అమ్మడు సూపర్‌ సక్సెస్ అయ్యింది. కారులో క్లీవేజ్ షో తో ఆకట్టుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని తెలుగు లో ఈ అమ్మడు వరుసగా సక్సెస్ లు దక్కించుకోకున్నా కూడా ఆఫర్లు మాత్రం రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. ఈమద్య కాలంలో ఈ అమ్మడు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ రెండు సినిమాలు కూడా నిరాశ పర్చాయి. అయినా కూడా లావణ్య అందానికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.