Begin typing your search above and press return to search.

దీపావళి రోజు అందాల రాక్షసి రిక్వెస్ట్‌

By:  Tupaki Desk   |   14 Nov 2020 9:45 AM IST
దీపావళి రోజు అందాల రాక్షసి రిక్వెస్ట్‌
X
సోషల్‌ మీడియా ద్వారా నేడు దీపావళి శుభాకాంక్షలను స్టార్‌ తమ అభిమానులకు మరియు ఫాలోవర్స్‌ కు చెబుతూ ఉన్నారు. అయితే కొందరు మాత్రం ఈసమయంలో స్టే సేఫ్‌ అంటూ మెసేజ్‌ లు ఇచ్చారు. అందులో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి చేసిన ఒక మెసేజ్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీపావళి రోజున క్రాకర్స్‌ కాల్చేందుకు ముందు నో పర్మీషన్‌ అన్నారు. కాని సుప్రీం కోర్టు రెండు గంటల పాటు టపాసులు కాల్చేందుకు అనుమతి ఇవ్వడంతో అంతా కూడా రెడీ అవుతున్నారు. ఈసమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని పెంపుడు జంతువుల విషయంలో పాశవికంగా ప్రవర్తించవద్దంటూ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి విజ్ఞప్తి చేసింది.

ప్రతి ఒక్కరు కూడా దీపావళిని సంతోషంగా జరుపుకోండి. టపాసులకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. పెంపుడు జంతువులు మరియు వీధి కుక్కలను కాపాడేలా క్రాకర్స్‌ ను ఉపయోగించాలంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. మొత్తానికి ఈ అమ్మడు చేసిన రిక్వెస్ట్‌ అందరిని ఆకట్టుకుంటుంది. దీపావళి సందర్బంగా సింపుల్‌ గా మెసేజ్ ఇచ్చి వెళ్లకుండా తన జంతు ప్రేమను చాటుకున్న లావణ్య త్రిపాఠి నిజంగా మంచి మనసున్న అమ్మాయి అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చావు కబురు చల్లగా సినిమాలో నటిస్తోంది. ఇక సందీప్‌ కిషన్‌ తో చేస్తున్న ఏ1 ఎక్స్‌ ప్రెస్‌ సినిమా షూటింగ్‌ ను ఇటీవలే ముగించింది. త్వరలో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓటీటీ కంటెంట్‌ విషయంలో కూడా ఈ అమ్మడు ఆసక్తిగా ఉంది. ‌