Begin typing your search above and press return to search.

హిట్టు కావాలని రేటు తగ్గించింది

By:  Tupaki Desk   |   9 Oct 2017 7:29 AM GMT
హిట్టు కావాలని రేటు తగ్గించింది
X

టాలీవుడ్ అందాల రాక్షసి మొన్నటి వరకు ఎక్కడ కనిపించినా చాలా సంతోషంగా కనిపించేది. విజయాల కళ తన మొఖంలో నిండుగా కనిపించేది. కానీ ఇప్పుడు అందాల రాక్షసి లావణ్య చాలా సీరియస్ గా ఉందట. ఏ మాత్రం తొందరపడకుండా జాగ్రతగా అలోచించి సినిమాలను చేస్తోందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే అమ్మడికి విజయాలు దక్కి చాలా కాలమే అయ్యింది.

భలే భలే మగాడివోయ్.. సోగ్గాడే చిన్ని నాయన.. వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత లావణ్య వరుసగా అయిదు అపజయాలను అందుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు ఫెయిల్ అవుతుంటే అమ్మడికి కాస్త కంగారుగానే ఉందట. చివరగా నాగ చైతన్య తో తీసిన యుద్ధం శరణం సినిమా అయితే దారుణమైన డిజాస్టర్ ని ఇచ్చింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని లక్కుతో వచ్చిన సినిమాలకోసం చాలానే కష్టపడుతుందట. అంతే కాకుండా రెమ్యునరేషన్ ని కూడా మీడియంలోనే తీసుకుంటుందని తెలుస్తోంది. వివి వినాయక్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో లావణ్య రీసెంట్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం లావణ్య 50 లక్షల రెమ్యునరేషన్ ని మాత్రమే తీసుకుందట.

అలాగే రామ్ ఉన్నది ఒకటే జిందగీ సినిమాకి కూడా అంతే డిమాండ్ చేసిందట. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత కాస్త పెంచినా ఆ తర్వాత అపజయాలు పలకరించడంతో కాస్త వెనుకడుగు వేసిందని తెలుస్తోంది. ఈమె కంటే తక్కువ హిట్స్ అందుకున్న హీరోయిన్స్ కూడా దాదాపు ఇంతే తీసుకుంటున్నారు. అయితే లావణ్య ప్రస్తుతం రెమ్యునరేషన్ ని ఏ మాతం లెక్క చేయడం లేదట కేవలం ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తుందని టాక్. చూడాలి మరి లావణ్య రెమ్యునరేషన్ ఆ సినిమాల తర్వాత పెరుగుతుందో లేదో..