Begin typing your search above and press return to search.

చైతు అచ్చం డాడీ మాదిరిగానే

By:  Tupaki Desk   |   27 Aug 2017 4:50 AM GMT
చైతు అచ్చం డాడీ మాదిరిగానే
X
అప్ కమింగ్ హీరోయిన్స్ లో స్టార్ స్టేటస్ అందుకునేందుకు అందాల రాక్షసి గట్టిగా పోటీ పడుతోందనే సంగతి ఇప్పటికే కొన్నిసార్లు చెప్పేసుకున్నాం. క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా రెమ్యూనరేషన్ దగ్గర ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు ఈ బ్యూటీ. అలాగే ఈమెకు పెద్ద మొత్తం ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్ కూడా వెనకాడ్డం లేదు. ఇప్పుడు యుద్ధం శరణం అంటూ నాగ చైతన్యతో కలిసి ప్రేక్షకుల ముందుకు రానుంది లావణ్య త్రిపాఠి.

యుద్ధం శరణం మూవీలో తన పాత్ర పెర్ఫామెన్స్ బేస్డ్ గా ఉంటుందని చెబుతోంది లావణ్య. "నేను ఓ ఇంటర్న్ పాత్ర పోషిస్తున్నాను. ఇది పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ గా ఉంటుంది. హీరో నాగచైతన్యను సపోర్ట్ చేసే రోల్ ఇది. సినిమా రిలీజ్ అయ్యాక మా ఇద్దరి ఆన్ స్క్రీన్ గురించి తెగ డిస్కషన్స్ జరుగుతాయి. లవ్ స్టోరీ.. ఫ్యామిలీ డ్రామా.. రెండింటినీ పక్కాగా కలిపి తెరకెక్కించిన మూవీ ఇది" అంటున్న లావణ్య త్రిపాఠి.. చైతుతో యాక్టింగ్ అనుభవాలను కూడా చెబుతోంది. చైతు డాడీ అయిన నాగార్జునతో కలిసి సోగ్గాడే చిన్ని నాయన మూవీలో హీరోయిన్ నటించిన అనుభవం ఉన్న లావణ్య.. తండ్రీకొడుకుల మధ్య బోలెడన్ని పోలికలు ఉన్నాయని అంటోంది.

"ఇద్దరూ భలే వినసొంపుగా మాట్లాడుతారు. మంచి మనసు విషయంలో మాత్రమే కాదు.. నిజ జీవితంలో ఇద్దరి బాడీ లాంగ్వేజ్ కూడా ఒక్క మాదిరిగానే ఉంటుంది. చైతు సెన్సాఫ్ హ్యూమర్ అయితే.. అదుర్స్ అనాల్సిందే" అని చెప్పిన లావణ్య త్రిపాఠి.. చెయ్-శామ్ ఇద్దరూ చక్కని జంట అంటోంది. సమంత కొన్ని సార్లు సెట్స్ కు వచ్చేదట. ఆ సమయంలో వీరి జంట చూడముచ్చటగా ఉంది అంటోంది అందాల రాక్షసి.