Begin typing your search above and press return to search.

ఆ విషయంలో కొంచెం జాగ్రత్తమ్మ!

By:  Tupaki Desk   |   29 Oct 2017 1:30 AM GMT
ఆ విషయంలో కొంచెం జాగ్రత్తమ్మ!
X
ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు సినిమాపై ఎంతవరకు ప్రభావాన్ని చూపుతున్నాయో తెలియదు గాని హీరోయిన్స్ కెరీర్ కి మాత్రం మైనెస్ గా మారుతున్నాయి. ఈ రోజుల్లో ఎక్కువగా హీరోయిన్స్ కి రొటీన్ పాత్రలే వస్తున్నాయి. దీంతో నటీమణులే కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు.

దర్శకుడు చెప్పిన స్టైల్ లోనే ట్రై చేస్తూ వారి టాలెంట్ ని కూడా చూపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆలా ఎన్ని ప్రయత్నాలు చేస్తోన్న కూడా ఒక హీరోయిన్ మాత్రం విజయాలను అందుకోవడం లేదు. సోగ్గాడే చిన్ని నాయన - బలే బలే మగాడివోయ్ వంటి హిట్స్ అందుకున్న లక్కీ లావణ్య ఆ తర్వాత అన్ లక్కీగా వరుస డిజాస్టర్స్ ని అందుకుంది. సినిమాలు ఫెయిల్ అవ్వడం సంగతి అటుంచితే.. అసలు ఒక్క సినిమాలోని పాత్ర అయినా లావణ్యకు కలిసి రాలేదు.

ముఖ్యంగా రాధ సినిమాలో రాధ పాత్ర అలాగే మిస్టర్ సినిమాలో చంద్రముఖి క్యారెక్టర్ ఇక మొన్న వచ్చిన యుద్ధం శరణం సినిమాలో అంజలి పాత్ర ఏ మాత్రం ఆకట్టుకోలేదు. అదే విధంగా నిన్న వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో మ్యాగీ పాత్ర కూడా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో అమ్మడు కొంచెం కథలను వినేటప్పుడు పాత్రల విషయంలో జాగ్రత్తలు వహిస్తే మంచిదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సినిమాల్లో అయినా జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో చూడాలి.