Begin typing your search above and press return to search.

స్మైలిచ్చేప్పుడు సూటిగా చూడ‌లేను బాబూ!

By:  Tupaki Desk   |   25 Jun 2021 5:30 PM GMT
స్మైలిచ్చేప్పుడు సూటిగా చూడ‌లేను బాబూ!
X
అందంగా న‌వ్వాలి.. చురుగ్గా సూటిగా చూస్తూ క‌వ్వింత‌కు దిగాలి. అన్ని ర‌కాల స్కిల్స్ ఉంటేనే న‌ట‌న‌లో రాణించ‌గ‌ల‌రు. ఇలాంటి మ్యాట‌ర్స్ లో అందాల క‌థానాయిక లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌తిభ గురించి చెప్పాల్సిందేం ఉంది? వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నా స‌రైన విజ‌యం ద‌క్క‌డం లేదు కానీ న‌టిగా మాత్రం లావ‌ణ్య ఫెయిల్ కాలేదు.

ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఏ 1 ఎక్స్ ప్రెస్ ..చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాలు డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డంతో ఆ ప్ర‌భావం నుంచి తేలిగ్గా బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతోంది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాల్లో లావ‌ణ్య నిరంత‌ర ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్ లోనే ఉంది.

తాజాగా బ్లూ టాప్.. కాంబినేష‌న్ డెనిమ్ జీన్స్ లో లావ‌ణ్య ఫోటోషూట్ హాట్ టాపిక్ గా మారింది. అలా స్మైలిచ్చేప్పుడు సూటిగా చూడ‌లేను అంటూ లావ‌ణ్య క్యాప్ష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. లావ‌ణ్య‌కు స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్కి చాలా కాల‌మే అయ్యింది. అర్జున్ సుర‌వ‌రం మంచి రివ్యూలు అందుకుంది. కానీ ఆ త‌ర్వాత రెండు సినిమాల‌పైనా ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటే అవి తీవ్రంగా దెబ్బ కొట్టాయి. కెరీర్ కి కిక్ ఇచ్చే ఒకే ఒక్క హిట్టు కోస‌మే వెయిటింగ్. లావ‌ణ్య ప్ర‌స్తుతం క‌థ‌లు వింటోంద‌ట. త్వ‌ర‌లోనే కొత్త ప్రాజెక్టును ప్ర‌క‌టించే వీలుంది.