Begin typing your search above and press return to search.

శ్రద్ధగా లాటిన్ డ్యాన్స్ నేర్చుకుంటోందట!

By:  Tupaki Desk   |   12 July 2019 10:07 AM GMT
శ్రద్ధగా లాటిన్ డ్యాన్స్ నేర్చుకుంటోందట!
X
అందాల రాక్షసిగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి 'అర్జున్ సురవరం' రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు ముందు లావణ్య నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరచడంతో ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకం పెట్టుకుంది. అయితే సినిమా రిలీజ్ డిలే అవుతోంది. ప్రస్తుతం తన చేతిలో క్రేజీ ఆఫర్లేవీ లేవు. దీంతో చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు డిసైడ్ అయిందట.

రీసెంట్ గా ఒక ఇంగ్లీష్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముంబైలో లాటిన్ డ్యాన్స్ నేర్చుకుంటున్నానని వెల్లడించింది. గత కొన్నివారాలుగా లాటిన్ డ్యాన్స్ క్లాసులకు హాజరవుతూ శ్రద్ధగా సాధన చేస్తోందట. లావణ్య భరతనాట్యం డ్యాన్సర్.. ఈ కొత్త డ్యాన్స్ నేర్చుకోవడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. లాటిన్ డ్యాన్స్ ఎందుకు నేర్చుకుంటున్నావని.. ప్రత్యేకమైన కారణం ఉందా అని అడిగితే "నా డ్యాన్సింగ్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశం..ఫన్ కూడా ఉంటుంది" అని చెప్పింది.

లాటిన్ డ్యాన్స్ ఎలా ఉంటుంది అంటే కమర్షియల్ జాజ్ ప్లస్ సాల్సా డ్యాన్స్ కాంబినేషన్ అన్నట్టుగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆఫర్లు లేకుండా.. ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలతో ఉండకుండా ఇలా స్కిల్స్ మెరుగుపరుచుకోవడం మంచిదే కదా. ఎవరైనా ఫిలిం మేకర్ ఈ అందాల రాక్షసికి అవకాశం ఇస్తే ఆ లాటిన్ డ్యాన్స్ ఎపిసోడ్ ను సినిమాలో పెట్టుకోవచ్చు!