Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చెలాకీ గజ్జెల గుర్రం

By:  Tupaki Desk   |   15 April 2015 1:30 AM GMT
ఫోటో స్టోరి: చెలాకీ గజ్జెల గుర్రం
X
ఓ అందమైన అమ్మాయి.. ఆధునిక యువతి .. పైన టిప్‌ టాప్‌.. కిందికి చూస్తేనే కాళ్లకు గజ్జెలు .. ఆ కాంబినేషనే క్యా సీన్‌ హై అన్నట్టుంది కదూ! కానీ ఈ కొత్త రూపం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. ఈ పిక్‌లో ఉన్నది లావణ్య త్రిపాఠి. సైలెంటుగా తెలుగు తెరపై దూసుకుపోతున్న అందాల రాక్షసి. చూడగానే నవలా నాయికలా కనిపించే ఈ అమ్మడు అమాయకత్వం కలబోసిన తెలుగుదనం నిండిన ముఖారవిందంతో చేయాల్సినంతా చేస్తోంది.

తొలిసినిమా అందాల రాక్షసితోనే యువతరం గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత మంచు కుటుంబ సినిమాలో నటించి మరింతగా చేరువైంది. ఇప్పుడు ఏకంగా స్టార్‌ హీరో నాగార్జున సరసన నాయికగా నటించేస్తోంది. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇదిగో ఇలా ట్రెండీ ఫోటో ఒకటి సామాజిక వెబ్‌సైట్‌లో పెట్టి చర్చల్లోకొచ్చింది. చెలాకీ గజ్జెల గుర్రమిదీ.. అంటూ అప్పట్లో ఓ లిరిసిస్టు ఏకంగా పాటే రాసుకున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో చూస్తే స్పందన ఎలా ఉంటుంది? గజ్జె కట్టిన గజగామినివా .. అని కొత్త లిరిక్‌ పుట్టదూ? ఈ గజ్జెలను గలగలలాడిస్తూ.. బీచ్‌ గట్టున పరిగెత్తిందిట!