Begin typing your search above and press return to search.

అబుదాబిలో అందాల లావణ్యం

By:  Tupaki Desk   |   5 Jan 2018 7:08 AM GMT
అబుదాబిలో అందాల లావణ్యం
X
సినిమాల కోసం ఫారిన్ కంట్రీస్ చుట్టేయడం ఎప్పటినుంచో జరుగుతున్న వ్యవహారమే. ఇక పాటల కోసం అయితే.. ప్రపంచంలోని కొత్త కొత్త ప్రదేశాలను తెగ అన్వేషించేస్తూ ఉంటారు మన మేకర్స్. ఇప్పటివరకూ టాలీవుడ్ స్క్రీన్ పై కనిపించని లొకేషన్స్ ను జనాలకు చూపిస్తూ.. సాంగ్స్ కు వాల్యూ అడిషన్ చేసేస్తుంటారు.

వివి వినాయక్ దర్శకత్వంలో సాయిధరంతేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ ఇంటెలిజెంట్. టైటిల్ పై అనౌన్స్ మెంట్ రాలేదు కానీ.. ఇదే పేరు దాదాపు ఖరారు అయిపోయింది. వచ్చే నెలలో ఈ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తుండగా.. ప్రస్తుతం ఈ సినిమా కోసం పాటల చిత్రీకరణ జరుగుతోంది. మస్కట్ లో ఒక పాటను తెరకెక్కించగా.. ఇప్పుడు అబుదాబి చేరుకుంది ఇంటెలిజెంట్ టీం. అబుదాబి రోడ్లపై నుంచి ఎత్తైన భవానాల బ్యాక్ డ్రాప్ తో షూటింగ్ చేసేస్తున్నారు. సుప్రీమ్ హీరోతో పాటు లావణ్య త్రిపాఠి ఈ పాటలో డ్యాన్సులు వేస్తోంది.

అందాల రాక్షసి గెటప్ నకు సంబంధించిన ఓ చూడముచ్చటైన ఫోటో.. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చేసింది. షార్ట్ లెంగ్త్ బాటమ్.. తెల్లగా మెరిసిపోతున్న స్లీవ్ లెస్ టాప్.. సన్నబడిన దేహం.. డిఫరెంట్ గా ట్రై చేసిన హెయిర్ స్టైల్.. మొత్తానికి అబుదాకి తన అందాల లావణ్యాన్ని చూపించేస్తోంది ఈ అందాల భామ. భారీ చిత్రాలే కాదు.. ఖాతాలో అనేక విజయాలను కూడా వేసుకున్న ఈ భామ.. మోడర్న్ గెటప్ లో మరీ మెరిసిపోతోందని ఫ్యాన్స్ తెగ చెప్పేసుకుంటున్నారు.