Begin typing your search above and press return to search.

ఇల్లు కొనుక్కున్న రాక్షసి

By:  Tupaki Desk   |   11 Jan 2018 12:11 PM IST
ఇల్లు కొనుక్కున్న రాక్షసి
X
హను రాఘవపూడి డెబ్యు మూవీ అందాల రాక్షసితో పరిచయమైన లావణ్య త్రిపాటి హైదరాబాద్ లో తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్నప్పుడల్లా ఒక ఫైవ్ స్టార్ హోటల్ రూంలో ఉండటం అలవాటు చెసుకున్న లావణ్య తనకు అవకాశాలు - ఫ్యూచర్ ఇక్కడే అని ఫిక్స్ అయిపోవడంతో స్వంతంగా తనకూ ఒక ఇల్లు ఉండాలి అనే కోరికను ఇటీవలే తీర్చేసుకుంది. మంచి పాష్ ఏరియాలో కావలసిన వసతులు ఉన్న ఒక చక్కని ఇంటిని గత కొన్ని నెలలుగా వెతుకుతున్న లావణ్య అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటున్న ఫ్లాట్ నే ఎంచుకున్నట్టు తెలిసింది. హోటల్ లో ఉండటం ఇబ్బందిగా ఫీల్ అవుతూ వచ్చిన లావణ్య ఇప్పుడు తనకే ఒక ఇల్లు ఉండటం పట్ల ఫుల్ హ్యాపీ గా ఉందట.

సంక్రాంతికి గృహప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న లావణ్య ఇండస్ట్రీలో తనకు బాగా దగ్గరైన వాళ్ళను - సన్నిహితులను కొందరినే దీనికి ఇన్ వైట్ చేయబోతోంది. లాస్ట్ ఇయర్ లావణ్య కు టైం అంతగా కలిసి రాలేదు. గ్లామర్ విషయంలో కొంచెం డోస్ పెంచి చేసిన ఉన్నది ఒకటే జిందగీ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో కొంత నిరాశ చెందినా లావణ్య కోసం కొన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి. వివి వినాయక్-సాయి ధరం తేజ్ కాంబో సినిమా ఇంటెలిజెంట్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది లావణ్య.

తమిళ్ లో 100% లవ్ రీమేక్ లో మొదట చేస్తాను అని చెప్పి డ్రాప్ అయ్యి తమను నష్టం కలిగించింది అని ఆ సినిమా ప్రొడ్యూసర్స్ లావణ్య మీద ఫిర్యాదు చేసారని చాలా వార్తలు వచ్చాయి. అది శాలిని పాండే ఎకౌంటులోకి వెళ్లిపోయింది. ఇలా అనుకోకుండా ఒకటి రెండు అవకాశాలు చేజారడంతో కొత్త ఇల్లు తనకు కలిసి వచ్చి చేస్తున్న సినిమాల సక్సెస్ తో పాటు అవకాశాలు కూడా ఇస్తుంది అని నమ్ముతోంది లావణ్య.