Begin typing your search above and press return to search.

ఫేస్ లో డబుల్ గ్లో వచ్చిందిగా..

By:  Tupaki Desk   |   11 Sep 2015 2:48 PM GMT
ఫేస్ లో డబుల్ గ్లో వచ్చిందిగా..
X
భలేభలే మగాడివోయ్ ఏ రేంజ్ హిట్ అయిందో చూస్తూనే ఉన్నాం. పెట్టిన పెట్టుబడి రాబట్టుకుని పదో పరకో సంపాదిస్తే బంపర్ హిట్ అని చెప్పుకునే రోజులివి. అలాంటిది హైద్రాబాద్ దాటకుండా సినిమా తీసేసి, నాలుగైదు రెట్లు వసూలు చేయడమంటే మామూలు విషయం కాదు. ఈ క్రెడిట్ బీబీఎం టీం మొత్తానికి దక్కుతుంది.

ఈ సినిమా దెబ్బకి అందరి రేంజ్ మారిపోయింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ మారుతీ, హీరో నానీ, ఆ తర్వాత హీరోయిన్ లావణ్య త్రిఫాఠిల గురించే. ఇంత సక్సెస్ కెరీర్ మొత్తంలో అయినా దక్కుతుందని ఊహించిందో లేదో ఈ రాక్షసి. అందుకే ఈ చిన్నది ఎక్కడ కనపడినా.. భలే మగాడి సంగతులు చెప్పేస్తోంది.

ఇలా కబుర్లు చెప్పడానికి ఎఫ్ ఎం రేడియో స్టేషన్ లకి కూడా వెళ్లిపోతుంది. రీసెంట్ గా మారుతీతో కలిసి బెజవాడలో రేడియోమిర్చిలో మాట్లాడేసింది. తెలుగు రాకపోయినా సరే.. బోలెడు కబుర్లు చెప్పింది శ్రోతలతో. ఎంత హ్యాపీగా ఉందంటే.. తను వస్తోంది టీవీషోకి కాదనే విషయం గుర్తు లేదమో.. అంత గ్లామర్ గా రెడీ అయిపోయింది. వాయిస్ వినిపించడానికే ఇంత గ్లామర్ గా వచ్చేస్తే.. ఇక ఒలకబోసే చోట్ల ఎన్ని హొయలు పోతుందో ?