Begin typing your search above and press return to search.

రెజీనాకి పోటీగా మారిందా?!

By:  Tupaki Desk   |   7 Sep 2015 2:29 AM GMT
రెజీనాకి పోటీగా మారిందా?!
X
మెగా హీరోయిన్... అనే కిరీటం ప్ర‌తీ సీజ‌న్‌ లోనూ ఓ భామ‌కి ద‌క్కుతుంటుంది. మొద‌ట్లో కాజ‌ల్‌ ని మెగా హీరోయిన్ అనేవారు. ఎందుకంటే ఆమె రామ్‌ చ‌ర‌ణ్‌ తో ఎక్కువ సినిమాలు చేసేది. మ‌ధ్య‌లో బ‌న్నీతోనూ జోడీ క‌ట్టింది. ఆ త‌ర్వాత ఆ ప్లేస్‌ని శ్రుతి హాస‌న్ సొంతం చేసుకొంది. ఆమె కూడా అటు చెర్రీతోనూ, ఇటు బ‌న్నీ తోనూ న‌టించింది. మ‌ధ్య‌లో ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ తోనూ ఆడిపాడింది. మ‌రి ఇప్పుడేమో రెజీనా ని మెగా హీరోయిన్ అని పిలుస్తున్నారు. బ‌న్నీ, చర‌ణ్‌ లాంటి అగ్ర హీరోలతో న‌టించక‌పోయినా ఆమెకి ఆ పేరొచ్చింది. సాయిధ‌ర‌మ్ తేజ్‌ తో వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం, అల్లు శిరీష్‌ తోనూ సినిమా చేయ‌డంతో రెజీనా మెగా హీరోయిన్ అయిపోయింది. ఆ ప్లేస్‌ని అమ్మ‌డు బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఎవ‌రైనా మెగా హీరోయిన్ అని పిలిస్తే భ‌లే సంతోష‌ప‌డిపోతుంటుంది. త‌దుప‌రి చెర్రీ, బ‌న్నీ, ప‌వ‌న్‌ లాంటి అగ్ర హీరోల‌తో న‌టించే ఛాన్స్ వ‌స్తుంద‌ని ఆశ‌గా ఉంది. అయితే ఇప్పుడు రెజీనాకి పోటీగా మ‌రో హీరోయిన్ వ‌చ్చింది. ఆమె ఎవ‌రో కాదు... లావ‌ణ్య త్రిపాఠి.

లావ‌ణ్య ఇప్ప‌టిదాకా మెగా హీరోల‌తో ఎవ్వ‌రితోనూ క‌లిసి న‌టించిందిలేదు కానీ... `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`తో ఆమెకి అంతా మెగా హీరోయిన్ అన్న క‌ల‌రింగే వ‌చ్చేసింది. ఎందుకంటే ఆ చిత్రం మెగా కాంపౌండ్ నుంచే వ‌చ్చింది. నాని స‌ర‌స‌న లావ‌ణ్య‌ని ఎంపిక చేయ‌డానికి మెగా కాంపౌండే కార‌ణం అని స‌మాచారం. సినిమా విడుద‌ల‌య్యాక కూడా మెగా హీరోలు ఆమెని ఆకాశానికెత్తేస్తున్నారు. బ‌న్నీ, అల్లు శిరీష్ `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` చూశాక లావ‌ణ్య‌కి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చార‌ట‌. చాలా అందంగా క‌నిపించావ‌ని మెచ్చుకొన్నార‌ట‌. దీంతో త‌దుప‌రి ఆ హీరోలు త‌మ సినిమాల్లో లావ‌ణ్య‌ కి ఛాన్స్ ఇవ్వొచ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. నిన్న‌టిదాకా మెగా హీరోల మ‌న‌సుల్లో రెజీనా మాత్ర‌మే ఉండేది. ఇప్పుడు ఆ లావ‌ణ్య కూడా వ‌చ్చేసింది. సో... రెజీనాకి కాంపిటీష‌న్ మొద‌లైన‌ట్టే క‌దా! అయితే రెజీనా `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌`తో ఇదే త‌ర‌హాలో ఆక‌ట్టుకొంటే మాత్రం మెగా హీరోయిన్ అన్న గుర్తింపుని మ‌ళ్లీ అలా నిల‌బెట్టుకొన్న‌ట్ట‌వుతుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.