Begin typing your search above and press return to search.

చావు కబురు చల్లగా వర్క్‌ షాప్‌ లో హీరోయిన్‌

By:  Tupaki Desk   |   24 Jun 2020 8:30 PM IST
చావు కబురు చల్లగా వర్క్‌ షాప్‌ లో హీరోయిన్‌
X
సాదారణంగా కొత్త నటీనటులకు దర్శకుడు యాక్టింగ్‌ మరియు మేకప్‌ విషయంలో వర్క్‌ షాప్‌ నిర్వహించడం జరుగుతుంది. షూటింగ్‌ కు ముందు వర్క్‌ షాప్‌ లో పాల్గొని చాలా విషయాలను కొత్త వారు నేర్చుకుంటారు. వర్క్‌ షాప్‌ లో సినిమాలోని పాత్ర తాలూకు లాంగ్వేజ్‌ మరియు ఆ పాత్రకు సంబంధించిన హవభావాలను పలికించడం నేర్పిస్తారు. కొన్ని సినిమాల్లో నటించిన వారు వర్క్‌ షాప్‌ లో పాల్గొనడం అనేది చాలా చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం.

లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కౌశిక్‌ పెగల్లపాటి ప్రస్తుతం వర్క్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. గత మూడు నెలలుగా షూటింగ్స్‌ లేకున్నా కూడా లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌ లోనే ఉండి పోయింది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని ఉన్నా కూడా వెళ్లలేని పరిస్థితుల్లో హైదరాబాద్‌ లోనే ఉండి పోయినట్లుగా లావణ్య పేర్కొంది. ఈ ఖాళీ సమయంలో కౌశిక్‌ నిర్వహించిన వర్క్‌ షాప్‌ లో పాల్గొనడంతో పాటు పలు విషయాలను నేర్చుకున్నట్లుగా పేర్కొంది.

గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చావు కబురు చల్లగా చిత్రంలో ఆర్‌ ఎక్స్‌ 100 చిత్ర హీరో కార్తికేయ హీరోగా నటిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్స్‌ కు అనుమతులు వచ్చిన నేపథ్యంలో త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ను పున: ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. మార్చురీ వాహనంను నడిపే వ్యక్తిగా బాలరాజు ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది.