Begin typing your search above and press return to search.
వీడియో: నిశ్చితార్థానికి ముందు సఖుని చెంతకు లావణ్య
By: Tupaki Desk | 9 Jun 2023 8:43 PM GMTవరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ఉంగరాలు మార్చుకుని నిఖా ను ఖాయం చేసుకున్న అరుదైన సందర్భమిది. నిశ్చితార్థాని కి కొన్ని గంటల ముందు లావణ్య త్రిపాఠి వరుణ్ హైదరాబాద్ నివాసాని కి విచ్చేసింది. ఒక పొడవాటి పడవలాంటి టిఎస్ 568 నంబర్ వైట్ కార్ వరుణ్ ఇంటి ముందు ఆగింది. ఇందు లో లావణ్య తో పాటు ఆమె తల్లిగారు కూడా కనిపించారు. కార్ లో అస్పష్ఠంగా కనిపించినా కానీ.. లావణ్య త్రిపాఠి ఎంతో ట్రెడిషనల్ లుక్ తో కనిపించారు. తలనిండుగా మల్లె పూల తో ఎంతో శోభ ను తెచ్చారని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
ఇప్పటికే అందిన సమాచారం మేర కు సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ఈ జంట నిశ్చితార్థం పూర్తయింది. ఈ అందమైన శుభ సాయంత్రం అనితా డోంగ్రే డిజైన్ చేసిన చీర లో లావణ్య కనిపించింది. ఈ నిశ్చితార్థం కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహిత మిత్రుల సమక్షం లో ప్రయివేట్ వేడుక గా సాగింది. ఈ ఏడాది చివర్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.
నిజానికి వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రేమ లో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం ఉంది. అంతరిక్షం సినిమాలో జంటగా కలిసి నటించిన క్రమం లో ఈ ఇద్దరి నడుమా ప్రేమ చిగురించిందని కథనాలొచ్చాయి. ఇప్పటికే వరుణ్ తేజ్ ఉత్తరాదికి చెందిన లావణ్య ను పెళ్లాడేందు కు ధృఢనిశ్చయంతో ఉన్నాడని తామరతంపరగా కథనాలొచ్చాయి. అదే క్రమంలో నిశ్చితార్థం గురించి గత కొన్ని రోజులు గా చర్చనీయాంశమైంది. ఎట్టకేట కు ఈ జంట నిశ్చితార్థం పూర్తయింది. మరిన్ని అధికారిక ఫోటోలు వీడియోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వరుణ్ తేజ్ కొణిదెల నటుడు నిర్మాత నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు కుమారుడు. మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను పెదనాన్న బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే వరుణ్ అంటే ఆ ఇద్దరి కీ వల్లమాలిన ప్రేమ. చిరంజీవి- రామ్ చరణ్ - అల్లు అర్జున్- అల్లు శిరీష్ - సాయి ధరమ్ తేజ్ -పంజా వైష్ణవ్ తేజ్ వరుణ్ నిశ్చితార్థాని కి విచ్చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో 1990లో జన్మించింది. ఆమె తండ్రి హైకోర్టు - సివిల్ కోర్టు లో న్యాయవాది గా పనిచేస్తుండగా తల్లి రిటైర్డ్ టీచర్. లావణ్య కు ఒక అన్న ఒక అక్క ఉన్నారు. అందాల రాక్షసి తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ పలు తెలుగు చిత్రాల తో పాటు కొన్ని తమిళ చిత్రాల లో నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలోను నటిస్తోంది.