Begin typing your search above and press return to search.
#నిహారిక పెళ్లి.. ఆ ఇద్దరేనా బుట్ట బొమ్మలు?
By: Tupaki Desk | 9 Dec 2020 11:32 AM ISTఉదయ్ పూర్ ప్యాలెస్ లో మెగా డెస్టినేషన్ వెడ్డింగ్ ఈవెంట్ కి సంబంధించిన ప్రతిదీ గూగుల్ లో ట్రెండింగ్ అవుతోంది. ఈ పెళ్లి వేడుక నుంచి ఇప్పటికే ఫోటోలు వీడియోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. నిహారిక- చైతన్య జంట వివాహం మరి కొద్ది గంటల్లోనే జరగనుంది.
ఈ వేడుకలో అతిథుల్ని పరిశీలిస్తే .. ఇందులో మెగా కుటుంబ హీరోలంతా కనిపిస్తున్నారు. కేవలం మెగా ఫ్యామిలీ సభ్యులు మినహా ఇండస్ట్రీ నుంచి ఇతరులు ఎవరూ కనిపించలేదు. అలాగే వరుడి తరపు బంధువులు ఉన్నారు. అయితే ఈ వేడుకకు ఎంతమంది అతిథులు విచ్చేస్తున్నారు? అంటే కోవిడ్ నిబంధనల వల్ల కేవలం 100 మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నారని తెలిసింది.
మెగా బ్రదర్ నాగబాబుకు అత్యంత సన్నిహితులు.. మెగాస్టార్ స్వయంగా ఆహ్వానించిన కొందరు మాత్రమే విచ్చేస్తుండగా.. నిహారిక తరపున ఎవరు విచ్చేశారు? అంటే.. తన స్నేహితులు మాత్రమే అటెండయ్యారట. ఇక కథానాయికల సందడి లేదా? అంటే... ఓ ఇద్దరు హీరోయిన్లు ఈ వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆ ఇద్దరు ఎవరు అంటే తెలుగమ్మాయి రీతు వర్మ.. హైదరాబాద్ లోనే సెటిలైన ఉత్తరాది బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆ ఇద్దరిలో రీతు తొలి నుంచి ఫ్రెండ్. లావణ్య రెగ్యులర్ జిమ్ క్లాస్ మేట్. అందుకే ఆ ఇద్దరికి మాత్రమే ఆహ్వానం అందిందట. మెగా ఆహ్వానం తమకు మాత్రమే అందినందుకు ఆ ఇద్దరి మోములో ఆనందం కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది. ఇక ఇతర ఇండస్ట్ర సభ్యులు స్నేహితులు ఈ వేడుకకు రారా? అంటే పెళ్లి అయిన అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ కి వీరిని ఆహ్వానిస్తారట. అది కూడా పరిమిత సభ్యులకు మాత్రమే. ఎందుకంటే కోవిడ్ నియమనిబంధనలతో ఆటంకం ఉండడం వల్ల ఎక్కువ మందిని ఆహ్వానించడం లేదని తెలిసింది.
రితు వర్మ `పెళ్లి చూపులు` సహా పలు చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ పెద్ద స్టార్ గా ఎదుగుతోంది. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ సరసన `మిస్టర్`లో నటించింది. సాయి తేజ్ సరసన `ఇంటెలిజెంట్`లో నటించింది.