Begin typing your search above and press return to search.

నవ్వుతోంది.. నేను కట్టలేను.. నాన్నా : నితిన్

By:  Tupaki Desk   |   26 July 2020 8:50 AM GMT
నవ్వుతోంది.. నేను కట్టలేను.. నాన్నా : నితిన్
X
టాలీవుడ్ యువ హీరో నితిన్ - కీర్తి సురేష్ కాంబినేషన్ లో ''రంగ్ దే'' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా నేడు నితిన్ - షాలినిల వివాహం సందర్భంగా 'రంగ్ దే' టీమ్ మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకి క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెళ్లి కొడుకు నితిన్ ఇలాంటి సమయంలో కూడా 'రంగ్ దే' కోసం డబ్బింగ్ చెప్పారు. నితిన్ డబ్బింగ్ చెప్తున్న వీడియోని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఈ వీడియోలో ''నాన్నా.. నవ్వుతోంది. నేను కట్టలేను.. నాన్నా...!'' అనే డైలాగ్ కి నితిన్ డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''నా మ్యారేజ్ టైమ్ లో కూడా నన్ను ఎంజాయ్ చేయనీయకుండా మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ నన్ను టార్చర్ పెట్టి డబ్బింగ్ చెప్పించారు. కానీ ఇదంతా కూడా మీకోసమే. నా అభిమానులందరికి 'రంగ్ దే' టీమ్ నుండి స్మాల్ గిఫ్ట్'' అని చెప్పుకొచ్చారు. ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ ''పెళ్లి టెన్షన్ లో ఉండి కూడా సినిమా కోసం మీ కమిట్మెంట్ కి హ్యాట్సాఫ్'' అని నితిన్ కి థ్యాంక్స్ చెప్పారు. నితిన్ మ్యారేజ్ రోజు రాబోతున్న స్మాల్ గిఫ్ట్ కూడా సినిమాలోని పెళ్ళికి సంబందిచిన టీజర్ అని డబ్బింగ్ వీడియో చూస్తే అర్థం అవుతోంది.

కాగా చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకున్న 'రంగ్ దే' త్వరలోనే మళ్ళీ చిత్రీకరణ స్టార్ట్ చేయబోతోందని సమాచారం.