Begin typing your search above and press return to search.

'కళావతి' మ్యూజిక్ వీడియో కోసం అంత ఖర్చు చేశారా..?

By:  Tupaki Desk   |   23 Feb 2022 3:30 PM GMT
కళావతి మ్యూజిక్ వీడియో కోసం అంత ఖర్చు చేశారా..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ''సర్కారు వారి పాట''. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. మోస్ట్ వాంటెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' 'ఆగడు' వంటి సినిమాల తర్వాత మహేష్ కు అదిరిపోయే ఆల్బమ్ ఇస్తున్నట్లు సంగీత దర్శకుడు చెబుతూ వస్తున్నారు.

చెప్పినట్లుగానే 'సర్కారు వారి పాట' సినిమా కోసం 'కళావతి' అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను అందించారు థమన్. వాలెంటైన్స్ వీక్ లో రిలీజ్ చేయబడిన ఈ పాట శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఇప్పటికే 42 మిలియన్లకు పైగా వ్యూస్ - 1.2 మిలియన్లకు మించి లైక్స్ తో ట్రెండింగ్ లో ఉంది. యువ సంగీత సంచలనం సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ గీతానికి లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యం అందించారు.

SVP ఫస్ట్ సింగిల్ ను లిరికల్ సాంగ్ గా కాకుండా మ్యూజిక్ వీడియోగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. థమన్ తన బృందంతో కలిసి షూట్ చేసిన ఈ సాంగ్ లో మహేష్ బాబు - కీర్తి సురేష్ క్లిప్పింగ్స్ కూడా జత చేసారు. అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స్ లో ఈ వీడియోని చిత్రీకరించారని తెలుస్తోంది. అయితే 'కళావతి' మ్యూజిక్ వీడియో సాంగ్ కోసం నిర్మాతలు బాగానే ఖర్చు చేసినట్లు టాక్.

ఈ ఒక్క మ్యూజిక్ వీడియో కోసం SVP మేకర్స్ దాదాపు 70 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. థమన్ ప్యాకేజీగా తీసుకొని ఈ పాటను చేసాడట. ఈ వీడియో కాన్సెప్ట్ మరియు కొరియోగ్రఫీ డిజైన్ చేసింది కూడా థమనే అనే టాక్ ఉంది. ముందుగా లీక్ చేయబడినప్పటికీ 'కళావతి' పాటకు మంచి స్పందనే వచ్చింది.

కాకపోతే ఇలా మ్యూజిక్ వీడియోలు - కవర్ సాంగ్స్ చేయడం వల్ల నిర్మాతలపై అదనపు భారం పడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ తీసుకొచ్చి బిజినెస్ బాగా జరగడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి కాబట్టి.. కాస్త ఖర్చు ఎక్కువైనా మేకర్స్ మ్యూజిక్ డైరెక్టర్ కు మద్దతుగా నిలుస్తున్నారనే వాళ్ళు కూడా లేకపోలేదు.

ఏదైతేనేం 'అల వైకుంఠపురంలో' సినిమా నుంచి ప్రతీ పెద్ద మూవీకి థమన్ ఇదే మ్యూజిక్ వీడియో స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇటీవల 'భీమ్లా నాయక్' - 'గని' సినిమాలకు కూడా భారీ స్థాయిలో కవర్ సాంగ్స్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'సర్కారు వారి పాట' ఫస్ట్ సింగిల్ ను మ్యూజిక్ వీడియోగా మలిచారు. థమన్ వల్ల సినిమా ఆడియో రైట్స్ మంచి ధర పలుకుతున్నాయి కాబట్టి.. ఇలాంటివి ఎన్ని చేసినా ఇబ్బంది లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కాగా, 'సర్కారు.. ' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని - వై రవి శంకర్ - గోపీ ఆచంట - రామ్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆర్ మది సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ఇప్పటికే దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకున్న SVP మూవీని సమ్మర్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా మే 12వ తేదీనవిడుదల చేయనున్నారు.