Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ‌ని ట్రోల‌ర్స్ బంతాడేస్తున్నారుగా!

By:  Tupaki Desk   |   5 April 2022 6:30 AM GMT
బుట్ట‌బొమ్మ‌ని ట్రోల‌ర్స్ బంతాడేస్తున్నారుగా!
X
ముంబై బ్యూటీ పూజాహెగ్డే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే విడుద‌లైన 'రాధేశ్యామ్' తో మ‌రో స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంటుంద‌ని భావించారు గానీ అంచ‌నాలు త‌ల్ల‌కిందుల‌య్యాయి. తదుప‌రి బ్యాక్ టూ బ్యాక్ అగ్ర హీరోల చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోంది. ఈనెల 13న కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ స‌ర‌స‌న న‌టించిన 'బీస్ట్' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఇటీవ‌లే రిలీజ్ అయిన సినిమా ట్రైల‌ర్ అంచ‌నాల్ని పెంచేసిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ వ‌న్ మ్యాన్ షో గా ట్రైల‌ర్ క‌నిపిస్తుంది. ట్రైల‌ర్ లో పూజాహెగ్డే పాత్ర‌కి ఏ మాత్రం ప్రాముఖ్య‌త లేద‌ని తేలిపోయింది. కేవ‌లం షాపింగ్ మాల్ లో ఓ సీన్ లోలో మాత్రమే కొన్ని సెక‌న్లు క‌నిపిస్తుంది. ఒక్క డైలాగ్ కూడా పూజా హెగ్డే పాత్ర‌కి ట్రైల‌ర్ లో ఎక్క‌డా పెట్ట‌లేదు. ఇప్పుడిదే పూజా బ్యూటీ పాలిట శాపంగా మారింది. మ‌రోసారి పూజాహెగ్డే ట్రోలింగ్ కి గురైంది.

పూజ పాత్ర‌కి సినిమాలో ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. అన్ని తెలిసినా ఈ సినిమా విష‌యంలో పూజాహెగ్డే ప్ర‌చారం ప‌నుల్ని నెత్తిన వేసుకుని మోసిందని అటున్నారు. అమ్మ‌డి సోష‌ల్ మీడియా ఖాతాల్లో 'బీస్ట్' ప్ర‌మోష‌న్స్ పీక్స్ లో ఉన్నాయి. పాత్ర‌కి ప్రాధాన్య‌త లేక‌పోయినా ప్ర‌చారానికి మాత్రం బాగా ప్రాధాన్య‌త ఇచ్చిందంటూ పూజా వ్య‌తిరేక వ‌ర్గం ఎటాక్ కి దిగింది.

ఎంత ప్రేమ లేక‌పోతే ఏకంగా మాల్దీవుల నుంచే సినిమాని ప్ర‌మోట్ చేస్తుందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. 'హ‌ల‌మ‌తి హ‌బీబో' పాట‌ని పూజాహెగ్డే త‌న ఇన్ స్టా రీల్స్ ద్వారా ప్ర‌మోట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత ట్రోలింగ్ ఏకంగా పీక్స్ కి చేరింద‌ని తెలుస్తోంది. దీంతో పూజా మ‌ద్ద‌తుదారులంతా ఆమె అంటే గిట్ట‌ని వారే ఇలా చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.

ఇటీవ‌లే ఓ తెలుగు అగ్ర హీరో విష‌యంలో పూజా హెగ్డే యెగ్ర‌సీవ్ గా వ్య‌వ‌రించింద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ హీరో అభిమానులు పూజా హెగ్డే ని సోష‌ల్ మీడియా వేదిక‌గా టార్గెట్ చేసారు. అమ్మ‌డి తీరుని త‌ప్పుబ‌ట్టారు. ఇప్పుడు అదే గ్యాంగ్ ప‌నిగ‌ట్టుకుని మ‌ళ్లీ ఇలా తెగ‌బ‌డుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

అయితే ఈ ట్రోలింగ్ పై ఇప్ప‌టి వ‌ర‌కూ పూజాహెగ్డే స్పందించ‌లేదు. రానున్న రోజుల్లో 'ఆచార్య' సినిమాతోనూ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌నుంది. సినిమా ఈ నెల‌ఖరున రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. తెలుగు నుంచి 'రాధేశ్యామ్' త‌ర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద చిత్రం కావ‌డి విశేషం. ఇంకా ప‌లు కొత్త ప్రాజెక్ట్ ల‌కి పూజా హెగ్డే సైన్ చేసిన సంగ‌తి తెలిసిందే.