Begin typing your search above and press return to search.

రేపు విడుదల... సూపర్ స్టార్‌ సందడే సందడి

By:  Tupaki Desk   |   12 April 2022 5:30 PM GMT
రేపు విడుదల... సూపర్ స్టార్‌ సందడే సందడి
X
తమిళ సూపర్ స్టార్‌ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన బీస్ట్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యంలో తమిళ నాట విజయ్ అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.

విజయ్ కి తెలుగు లో ఎక్కువగా బిజినెస్ లేదు. అయినా కూడా ఈ సినిమా పై నమ్మకంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ గత చిత్రాల అనుభవం రిత్యా నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ అంచనాలు పెంచింది. భారీగా సినిమా వసూళ్లు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

తమిళనాట ఈ సినిమా సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాక్ తో సంబంధం లేకుండా మొదటి రెండు మూడు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక భారీ ఎత్తున అంచనాలున్న కేజీఎఫ్‌ 2 సినిమా ఒక్క రోజు గ్యాప్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. దాంతో ఈ రెండు సినిమాల మద్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటున్నారు.

బీస్ట్‌ సినిమాలో విజయ్ కి జోడీగా తెలుగు స్టార్‌ హీరోయిన్ పూజ హెగ్డే నటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమాను దక్కించుకుంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. తెలుగు ఈ సినిమా 20 కోట్ల వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

విజయ్ ఈ సినిమా తర్వాత తెలుగు లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

దిల్ రాజు సినిమా ను నిర్మిస్తున్నాడు. కనుక బీస్ట్‌ సినిమా ఒక మోస్తరుగా ఆడినా ఖచ్చితంగా మంచి టాక్ ను తదుపరి సినిమా దక్కించుకునే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.