Begin typing your search above and press return to search.

స‌మంత ఖాతాలో మ‌రో కొత్త‌ రికార్డ్

By:  Tupaki Desk   |   16 March 2022 9:36 AM GMT
స‌మంత ఖాతాలో మ‌రో కొత్త‌ రికార్డ్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `పుష్ప ది రైజ్‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ - బ‌న్నీల క‌ల‌యిక‌లో వ‌చ్చిన మూడ‌వ చిత్ర‌మిది. మైత్రీ మూవీ మేక‌ర్స్ , ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించింది. బ‌న్నీ కెరీర్ లోనే రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది.

ఉత్త‌రాదిలో వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించిన ఈ మూవీ మేన‌రిజ‌మ్స్‌, హుక్ స్టెప్‌, శ్రీ‌వ‌ల్లీ.., పుష్ప సిగ్నేచ‌ర్ స్టెప్.. త‌గ్గేదేలే.. డైలాగ్ యూనివ‌ర్స‌ల్ వైడ్ గా వైర‌ల్ గా మారి స‌రికొత్త రికార్డులు సృష్టించింది. ఇదిలా వుంటే ఈ చిత్రం కోసం స్టార్ హీరోయిన్ స‌మంత చేసిన ఐట‌మ్ సాంగ్ మ‌రింత‌గా పాపుల‌ర్ అయింది. `ఊ అంటావా మావ‌.. ఊ హూ అంటావా.. ` అంటూ సాగే పాట‌లో సామ్ ప్ర‌త్యేకంగా న‌టించి ఆక‌ట్టుకుంది.

`పుష్ప‌` చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన ఈ పాట నెట్టింట మ‌రో స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా హొయ‌లు పోతూ స‌మంత చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్‌, బ‌న్నీతో క‌లిసి చేసిన స్టెప్పులు ఈ పాట‌ని మ‌రింత క్రేజీగా మార్చాయి. దీంతో ఈ ప్ర‌త్యేక గీతం వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ అవుతోంది. ఇప్పటికే ప‌లు రికార్డుల్ని సొంతం చేసుకున్న ఈ సాంగ్ తాజాగా మ‌రో మైలు రాయిని అధిగ‌మించి రికార్డు సృష్టించింది.

యూట్యూబ్‌లో ఈ పాట 200 మిలియ‌న్ వ్యూస్ ని అధిగ‌మించ‌డం విశేషం. తాజా రికార్డుని బ‌ట్టి ఈ పాట‌కు ఏ స్థాయి క్రేజ్ క్రియేట్ అయ్యిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదే చిత్రంలోని శ్రీ‌వ‌ల్లి సాంగ్ 100 మిలియ‌న్ వ్యూస్ రికార్డుని సాధించింది. మిగ‌తా పాట‌లు కూడా భారీ స్థాయిలో వ్యూస్ ని రాబ‌ట్టాయి. అయితే స‌మంత మేనియా కార‌ణంగా `ఊ అంటావా మావ ఊహూ అంటావా..` భారీ క్రేజ్ ని సొంతం చేసుకుని నెట్టింట రికార్డ‌లు సృష్టిస్తుండ‌టం విశేషం.

`పుష్ప‌`కు ల‌భించిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్ పార్ట్ 2 ని మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ట‌. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని ప్రారంభించిన చిత్ర బృందం ఏప్రిల్ లేదా మేలో పార్ట్ 2 ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారంటూ వార్త‌లు వ‌నిపిస్తున్నాయి. పార్ట్ 1లో స‌మంత మెరుపులు మెరిపించింది.

పార్ట్ 2 లో మ‌రో సారి స‌మంత‌ని ప్ర‌త్యేక గీతం కోసం రంగంలోకి దింపేస్తారా? లేక బాలీవుడ్ హీరోయిన్ తో కానిచ్చేస్తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.