Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ టీమ్ కి షాకిచ్చిన బుట్ట‌బొమ్మ‌

By:  Tupaki Desk   |   2 March 2022 9:30 AM GMT
ప్ర‌భాస్ టీమ్ కి షాకిచ్చిన బుట్ట‌బొమ్మ‌
X
రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్స్ లో పూజా హెగ్డే పాల్గొన‌డం లేదంటూ గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. `రాధేశ్యామ్‌` టీమ్ కూడా పూజా క‌మిట్మెంట్ ల కార‌ణంగా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌క పోవ‌చ్చిన భావించారు. కానీ తాజా అప్ డేట్ ప్ర‌కారం పూజా హెగ్డే `రాధేశ్యామ్‌` టీమ్‌కు షాకిచ్చిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే... పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన భారీ చిత్రం `రాధేశ్యామ్‌`. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించేసింది చిత్ర బృందం.

డెస్టీనికి ప్రేమ‌కు మ‌ధ్య సాగే స‌మ‌రం నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెర కెక్కించారు. 1970`s కాలంలో యూర‌ప్ నేప‌థ్యంలో సాగే హెరిటేజ్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ ఇది. ఇట‌లీలో క‌నిపించ‌కుండా పోయిన ట్రైన్‌.. డానిన్సీ ఓడ‌ల‌ని త‌ల‌పించే స‌న్నివేశాలు ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్స్ గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ లు సినిమా ఓ హెరిటేజ్ ల‌వ్ స్టోరీగా విజువ‌ల్ వండ‌ర్ గా వుండ‌నుంద‌నే సంకేతాల్ని అందించింది.

క‌ల‌వ‌ని ఇద్ద‌రు ప్రేమికుల అంద‌మైన ఫీల్ గుడ్ ల‌వ్ సాగా గా ఈ సినిమా వుండ‌బోతోంది. పూజా హెగ్డే, ప్ర‌భాస్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి. `బాహుబ‌లి` త‌రువాత ఆ ఆస్థాయిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీపై ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచనాల‌కు త‌గ్గ‌ట్టుగా చిత్ర బృందం ఈ మూవీ ప్ర‌చారాన్ని దేశ వ్యాప్తంగా వున్న ప్ర‌ధాన న‌గ‌రాల్లో నిర్వ‌హించ‌బోతోంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ప‌క్కా ప్ర‌ణాళిక‌ని టీమ్ సిద్ధం చేసింది.

ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్ర‌మోష‌న్స్ ని భారీగా నిర్వ‌హించ‌బోతోంది. అయితే ఈ ప్ర‌మోష‌న్స్ లో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే పాల్గొన‌డం లేద‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు ర‌క ర‌కాల కార‌ణాల‌ని వివ‌రిస్తూ నెట్టింట వార్త‌లు పుట్టుకొచ్చాయి.

అయితే తాజా అప్ డేట్ ప్ర‌కారం పూజా హెగ్డే `రాధేశ్యామ్‌` ప్ర‌మోష‌న్స్ యాక్టీవ్ గా పాల్గొన‌బోతోంద‌ని ఆమె టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. ఆ మ‌ధ్య ఈ మూవీ కోసం డ‌బ్బింగ్ పార్ట్ ని ఫినిష్ చేసిన పూజా హెగ్డే ప్ర‌మోష‌న్స్ లోనూ పాల్గొన‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగా ఆమె టీమ్ మెంబ‌ర్స్ చెబుతున్నారు.

బుధ‌వారం `రాధేశ్యామ్‌` రిలీజ్‌ ట్రైల‌ర్ ని మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌బోతున్నారు. ట్రైల‌ర్ రిలీజ్ తో ఎగ్రెసీవ్ గా ప్ర‌మోష‌న్స్ ని కిక్ స్టార్ట్ చేస్తోంది చిత్ర బృందం. ట్రైల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయితే సినిమాపై హైప్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం అంటున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల కానున్న ఈ మూవీని త‌మిళంలో యంగ్ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ రిలీజ్ చేస్తుండ‌గా హిందీలో టి సిరీస్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతోంది.