Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 30 ఏం జరుగుతుంది

By:  Tupaki Desk   |   2 March 2022 4:22 AM GMT
ఎన్టీఆర్‌ 30 ఏం జరుగుతుంది
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఆయన తదుపరి సినిమా కూడా కన్ఫర్మ్‌ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 సినిమా పట్టాలెక్కబోతుంది అంటూ చాలా నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఏడాది దాటినా కూడా ఇంకా క్లాప్‌ పడక పోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణం చూపిస్తూ వాయిదా వేస్తున్న కొరటాల శివ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ తో ఇప్పటికే జనతా గ్యారేజ్‌ సినిమాను చేసిన కొరటాల శివ మరోసారి ఒక మంచి కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాదిలోనే వీరి కాంబో సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు షూటింగ్‌ ప్రారంభం అవ్వక పోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది సమ్మర్ లోనే అదుగో ఇదుగో అంటూ హడావుడి చేశారు. కాని ఈ ఏడాది సమ్మర్‌ వస్తుంది. కాని ఇప్పటి వరకు షూటింగ్‌ ప్రారంభం అవ్వలేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ 30 సినిమాకు సంబంధించిన చివరి దశ స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందట. ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివలు పలువురు రచయితలతో కలిసి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు వారాల్లో మొత్తం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవుతుందని అంటున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటాడు. కొరటాల శివ ఆచార్య విడుదల పనుల్లో పడుతాడు.

ఆ రెండు సినిమాలు విడుదల అయిన తర్వాత ఇద్దరు కూడా పూర్తిగా ఫ్రీ అవుతారు. అప్పుడు వీరి కాంబో మూవీ ని పట్టాలెక్కించే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మే నెలలో ఖచ్చితంగా సినిమాను పట్టాలెక్కిస్తారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట.

ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్‌ ను మించిన సినిమా వస్తుందనే నమ్మకంతో అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కథ ఉంటుందని అంటున్నారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌ గా మారబోతున్నాడు. అందుకు తగ్గట్లుగా కూడా కొరటాల శివ తన కథను మల్చుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ సినిమా చూడక చాలా కాలం అయ్యింది. కనుక అభిమానులు చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.