Begin typing your search above and press return to search.

షాకుల మీద షాకులిస్తున్న నాగ‌చైత‌న్య‌

By:  Tupaki Desk   |   3 March 2022 12:30 AM GMT
షాకుల మీద షాకులిస్తున్న నాగ‌చైత‌న్య‌
X
టాలీవుడ్ లో మ‌న హీరోలు మునుపెన్న‌డూ లేనంత‌గా స్పీడుని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. గ‌తంలో ఏడాదికి ఒక‌టి రెండు ప్రాజెక్ట్ ల‌కే ప‌రిమిత‌మై మ‌రో ప్రాజెక్ట్ ని చేయ‌డానికి అంగీక‌రించ‌ని మ‌న హీరోలు ఇప్ప‌డు ఎడాపెడా వ‌రుస చిత్రాల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

ఒక సినిమా సెట్ పై వుండ‌గానే మ‌రో సినిమాని థియేట‌ర్ల‌లోకి దించేస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న హీరోల వ‌ర‌కు ఇదే జోరుని చూపిస్తూ చేతినిండా సినిమాల‌తో బిజీగా గ‌డిపేస్తున్నారు.

ఇప్పుడు ఈ జాబితాలోకి యంగ్ హీరో నాగ‌చైత‌న్య కూడా చేరిపోయారు. ఇటీవ‌లే కింగ్ నాగార్జున తో క‌లిసి రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `బంగార్రాజు` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన నాగ‌చైత‌న్య ఈ మూవీ త‌రువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో షాకుల మీద షాకులు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్ లో `థాంక్యూ` మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

ఈ నేఫ‌థ్యంలో తాజాగా వెబ్ సిరీస్ ని ప‌ట్టాలెక్కించాడు. విక్ర‌మ్ కె. కుమార్ ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. మంగ‌ళ‌వారం మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా త‌న కొత్త ప్ర‌యాణం మొద‌లైందంటూ ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుని స‌ర్‌ ప్రైజింగ్ షాకిచ్చారు నాగ‌చైత‌న్య‌. `దూత‌` పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తోంది. మొత్తం 10 భాగాలుగా రూపొంద‌నున్న ఈ సిరీస్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నుంద‌ని, ఇందులో చై నెగెటివ్ ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే తాజాగా నాగాచైత‌న్య మ‌రో షాకింగ్ న్యూస్ చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మిళంలో విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ష‌న్ లో నాగ‌చైత‌న్య తాజాగా ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలిసింది. ఇదొక పిరియాడిక్ యాక్ష‌న్ డ్రామా అని, 1990`s నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ని తెలుస్తోంది. ఇదొక ప్రేమ‌క‌థ అని, ఇందు కోసం ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు స్క్రీప్ట్ ని సిద్ధం చేస్తున్నార‌ని చెబుతున్నారు.

పిరియాడిక్ ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో నాగచైత‌న్య‌కు జోడీగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టించ‌నుంద‌ని, ఇప్ప‌టికే ఆమెని ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు సంప్ర‌దించార‌ని, పూజా కూడా స్టోరీ న్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని త్వ‌రలోనే మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టుగా తెలిసింది. నాగ‌చైత‌న్య ఇదే ఏడాది అమీర్ ఖాన్ న‌టించిన `లాల్ సింగ్ చ‌ద్దా` చిత్రంతో బాలీవుడ్ కు ప‌రిచయం అవుతున్న విష‌యం తెలిసిందే.