Begin typing your search above and press return to search.

మార‌న్‌ : ఇన్వెస్టిగేటివ్‌ జ‌ర్న‌లిస్ట్ స‌మ‌రం

By:  Tupaki Desk   |   28 Feb 2022 1:37 PM GMT
మార‌న్‌ : ఇన్వెస్టిగేటివ్‌ జ‌ర్న‌లిస్ట్ స‌మ‌రం
X
త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ విల‌క్ష‌ణ క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న‌మైన క‌థ‌లలో న‌టిస్తూ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక మూవీ సెట్స్ పై వుండ‌గానే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని అంగీక‌రిస్తూ అదే త‌ర‌హాలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవ‌ల ధ‌నుష్ న‌టించిన చిత్రాలు విడుద‌లైనంత‌గా ఏ సినిమా హీరో చిత్రాలు విడుద‌ల కాలేదు. చాలా వ‌ర‌కు ఓటీటీల్లో విడుద‌ల‌వుతున్న ధ‌నుష్ చిత్రాలు వ‌రుస‌గా విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నాయి.

గ‌త ఏడాది బాలీవుడ్ మూవీ `అత్రంగీరే`, త‌మిళ చిత్రాలు క‌ర్ణ‌న్‌, జ‌గ‌మే తంత్రం సినిమాతో ప్రేక్ష‌కుల‌ముందుకొచ్చాడు. ఈ చిత్రాల‌న్నీ ఓటీటీలో విడుద‌లై మంచి విజ‌యాల్ని సాధించాయి. తాజాగా మ‌రో చిత్రంతో ప్రేక్ష‌కులని ఎంట‌ర్ టైన్ చేయ‌బోతున్నాడు. ధ‌నుష్ న‌టించిన తాజా చిత్రం `మార‌న్‌`. కార్తీక్ న‌రేఫ‌ష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని టి.జి. త్యాగ‌రాజ‌న్‌ నిర్మించారు. ఇందులో ధ‌నుష్ కు జోడీగా మాళవిక మోహ‌న‌న్ న‌టించింది. జి.వి. ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. తాజాగా ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 11న ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు.

తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుద‌ల కాబోతోంది. ఇన్వెస్టిగేటివ్‌ జ‌ర్న‌లిస్ట్ స‌మ‌రం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో ధ‌నుష్ నిజాల‌ని నిర్భ‌యంగా రాసే ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్నిలిస్టుగా న‌టించాడు. అత‌నికి స‌హాయ‌ప‌డే యువ‌తిగా మాళ‌వికా మోహ‌న‌న్ న‌టించింది.

సిన్సియ‌ర్ గా త‌న వృత్తి ధ‌ర్వాన్ని నిర్వ‌ర్తించే ఇన్వెస్టిగేటివ్‌ జ‌ర్న‌లిస్ట్ కి ఓ పొలిటీషియ‌న్ కి మ‌ధ్య వార్ మొద‌ల‌వుతుంది. ఈ క్ర‌మంలో ధ‌నుష్ ఏం చేశాడు. త‌న‌ని టార్గెట్ చేసిన పొలిటీషియ‌న్ స‌ముద్రఖ‌నికి ఎలా గుణ‌పాఠం చెప్పాడ‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌మిళంలో `మార‌న్‌` గా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్‌ జ‌ర్న‌లిస్ట్ గా ధ‌నుష్ చేసే సాహ‌సాలు, మాళ‌విక మోహ‌న‌న్ - ధ‌నుష్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నున్నాయి.

ధ‌నుష్ ఈ మూవీతో పాటు ఇంగ్లీష్ లో `ద గ్రే మ్యాన్`, త‌మిళంలో `తిరుచిత్రాంబ‌లం`, నానే వ‌రువేన్ , వాతీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. తెలుగులో ఇదే ఏడాది ఎంట్రీ ఇస్తున్న ధ‌నుష్ `సార్‌` పేరుతో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ ల‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు.