Begin typing your search above and press return to search.

కమర్షియల్‌ సినిమాకా బాప్.. ఓటీటీ ఎంట్రీ

By:  Tupaki Desk   |   10 March 2022 5:07 AM GMT
కమర్షియల్‌ సినిమాకా బాప్.. ఓటీటీ ఎంట్రీ
X
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉంటారు. కాని కమర్షియల్‌ సినిమాలను ఇవ్వగల దర్శకులు కొందరే ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్‌ సినిమాలను ఇవ్వగల బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి. ఈయన ఈమద్య కాలంలో తీసిన సినిమాలన్నీ కూడా వందల కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను దక్కించుకున్నాయి. భారీ ఎత్తున బడ్జెట్‌ ఖర్చు చేయకుండా సింపుల్ గా హీరో స్టార్ డమ్ ను ఉపయోగించుకుని అద్బుతమైన సినిమాలను తీయగల దర్శకుడు రోహిత్‌ శెట్టి.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటినా ఎడా పెడా సినిమాలు తీయకుండా మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ కూడా కమర్షియల్‌ సినిమా కా బాప్‌ అనే పేరును దక్కించుకున్నాడు. ఇండస్ట్రీలో ఈయన బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్ లు ఇస్తున్న నేపథ్యంలో ఆయన తో సినిమాకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు.. సూపర్‌ స్టార్‌ లు కూడా సిద్దంగా ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వెండి తెరపై ఇప్పటి వరకు వందల కోట్ల ను కురిపించిన ఈ దర్శకుడు ఓటీటీ లో అడుగు పెట్టేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటి వరకు ఇండియన్ ఓటీటీ స్క్రీన్‌ పై రానటువంటి ఒక బిగ్గెస్ట్‌ మాస్‌ ఎంటర్‌ టైనర్‌ ను రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అమెజాన్ ప్లాన్‌ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్ ఇందుకోసం అతి పెద్ద మొత్తంను ఖర్చు చేస్తుందనే టాక్ వినిపిస్తుంది.

రోహిత్ శెట్టి దర్శకత్వంలో సినిమా అంటే పక్కా కమర్షియల్‌ అనే టాక్‌ పడిపోయింది. అందుకే ఆయనకు భారీ పారితోషికం ఇస్తూ ఉంటారు. బాలీవుడ్‌ దర్శకుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే వారి జాబితాలో ఈయనకు ప్లేస్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. రోహిత్‌ శెట్టి వరుసగా పోలీస్ స్టోరీలను తెరకెక్కించి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ లను అందుకున్న విషయం తెల్సిందే.

అమెజాన్ లో ఈయన చేయబోతున్న ప్రాజెక్ట్‌ కూడా పోలీస్‌ స్టోరీ అని సమాచారం అందుతోంది. బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్ర కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా అమెజాన్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్‌ గురించిన పూర్తి వివరాలను అమెజాన్ అతి త్వరలోనే వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వెండి తెరపై కమర్షియల్‌ సినిమాలను ఇచ్చిన ఈయన అమెజాన్ ఓటీటీ పై ఏ స్థాయి సందడి చేస్తాడో చూడాలి.